e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, May 12, 2021
Home News పాక్ తొలి ఆర్థిక మంత్రి చాన్స్‌కు నో.. ఎవ‌రంటే..!

పాక్ తొలి ఆర్థిక మంత్రి చాన్స్‌కు నో.. ఎవ‌రంటే..!

పాక్ తొలి ఆర్థిక మంత్రి చాన్స్‌కు నో.. ఎవ‌రంటే..!

న్యూఢిల్లీ: బిజినెస్ అంటే తేలిక జాబేం కాదు.. అష్ట క‌ష్టాలు ప‌డి.. ఒడిదొడుకుల‌ను ఎదుర్కొని నిల‌బ‌డగ‌ల‌గాలి.. అలా ప్ర‌పంచంలోనే అన్ని స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కొని అత్యంత విజ‌య‌వంత‌మైన వ్యాపారుల‌కు పుట్టినిల్లు ఇండియా..

ర‌త‌న్ టాటా టూ ఆదానీ

రిల‌య‌న్స్ చైర్మ‌న్ ముకేశ్ అంబానీ, పారిశ్రామిక వేత్త ర‌త‌న్ టాటా, మ‌హీంద్రా గ్రూప్ చైర్మ‌న్ ఆనంద్ మ‌హీంద్రా, హెచ్‌సీఎల్ ఫౌండ‌ర్ శివ్ నాడార్‌, ఐటీ మేజ‌ర్ విప్రో అధినేత అజీం ప్రేమ్‌జీ, అదానీ గ్రూప్ చైర్మ‌న్ గౌతం ఆదానీ త‌దిత‌రులు అత్యంత స‌క్సెస్‌ఫుల్ బిజినెస్ టైకూన్ల‌లో కొంద‌రు.

ఇండియ‌న్ గ్రోత్‌లో కార్పొరేట్ల పాత్ర

ముడి చ‌మురు మొద‌లు ఐటీ వ‌ర‌కు.. టెలికం నుంచి ఆటో వ‌ర‌కు.. అన్ని రంగాల్లో భార‌త్ ప్ర‌గ‌తిలో వీరంతా త‌మ‌వంతు పాత్ర పోషించిన‌వారే. వీరిలో కొంద‌రు పాకిస్థాన్‌లో జ‌న్మించిన వారు.. దేశ విభ‌జ‌న టైంలో పాక్‌కు వెళ్లిన వారి కుటుంబ స‌భ్యులు.. కానీ పాకిస్థాన్‌తో అత్యంత స‌న్న‌హిత సంబంధాలు ఉన్న మోస్ట్ స‌క్సెస్ ఫుల్ ఇండియ‌న్ బిజినెస్‌మెన్‌లు ఉన్నార‌న్న సంగ‌తి దాదాపు ఎవ‌రికీ తెలియ‌ద‌నే చెప్పాలి.

పాక్ వెళ్లేందుకు వాడియా గ్రూప్ చైర్మ‌న్ నో

వాడియా గ్రూప్ చైర్మ‌న్ నుస్లీ వాడియా.. వాస్త‌వంగా పాకిస్థాన్ వ్య‌వ‌స్థాప‌కుడు మ‌హ్మ‌ద్ అలీ జిన్నా మ‌నుమ‌డు. ఇండియాకు స్వాతంత్ర్యం వ‌చ్చి భార‌త్‌, పాకిస్థాన్‌గా దేశం విడిపోయిన‌ప్పుడు జిన్నా కూతురు డినా మాత్రం త‌న భ‌ర్త నుస్లీ వాడియాతో క‌లిసి ఇండియాలోనే ఉండిపోవాల‌ని నిర్ణ‌యించుకున్నార‌ట‌.

వాడియా గ్రూప్ చైర్మ‌న్ బాట‌లోనే ప్రేమ్‌జీ తండ్రి

దేశంలోని ప్ర‌ముఖ ఐటీ సంస్థ‌ల్లో ఒక్క‌టైన విప్రో వ్య‌వ‌స్థాప‌కుడు అజీం ప్రేమ్‌జీ.. తండ్రి మ‌హ్మ‌ద్ హ‌షీం ప్రేమ్ జీ కూడా పాకిస్థాన్ తొలి క్యాబినెట్‌లో ఆర్థిక మంత్రిగా చేరేందుకు నిరాక‌రించార‌ట‌. ప్ర‌పంచంలోనే అత్యంత ప్ర‌ముఖ దాత‌ల్లో ఒక‌రైన అజీం ప్రేమ్‌జీ తండ్రి మ‌హ్మ‌ద్ హ‌షీం ప్రేమ్ జీ పేరొందిన వ్యాపార వేత్త‌.

వంట నూనెల త‌యారీ వ్యాపారిగా..

బ‌ర్మాలో బియ్యం వ్యాపారిగా పేరు ప్ర‌తిష్ట‌లు సంపాదించుకున్న మ‌హ‌మ్మ‌ద్ హ‌షీం ప్రేమ్‌జీ.. 1945లో భార‌త్‌కు వచ్చి ఇక్క‌డ బిజినెస్ ప్రారంభించారు. మ‌హారాష్ట్ర‌లో‌ని జ‌ల‌గావ్ జిల్లా అమ‌ల్నీర్ ప్రాంతంలో వెస్ట్ర‌న్ ఇండియ‌న్ వెజిట‌బుల్ ప్రొడ‌క్ట్స్ ప్రారంభించారు. ఈ కంపెనీ ద్వారా స‌న్‌ఫ్ల‌వ‌ర్ వ‌న‌స్ప‌తి పేరిట వంట నూనెలు త‌యారీ ప్రారంభించింది.

పాక్ తొలి ఆర్థిక మంత్రి చాన్స్‌కు నో.. ఎవ‌రంటే..!

హ‌షీం ప్రేమ్‌జీ జాతీయ‌త ఇలా

భార‌త్‌లో ఐటీ ఇండ‌స్ట్రీ ప్ర‌గ‌తిపై లాంగ్ రివ‌ల్యూష‌న్ అనే పేరుతో పుస్త‌కం రాసిన సైన్స్ జ‌ర్న‌లిస్ట్ దినేశ్ సీ శ‌ర్మ‌.. ప్రేమ్‌జీ తండ్రి మ‌హ్మ‌ద్ హ‌షీం ప్రేమ్‌జీకి గ‌ల అసాధార‌ణ జాతీయ‌వాదాన్ని ప్ర‌ద‌ర్శించార‌ని పేర్కొన్నారు.

ప్లానింగ్ ఫ‌ర్ పాక్ క‌మిటీలో భాగ‌స్వామ్యానికి నో

ప్లానింగ్ ఫ‌ర్ పాకిస్థాన్‌! ది ప్లానింగ్ క‌మిటీ ఆఫ్ ది ఆల్ ఇండియా ముస్లింలీగ్ 1943-46 అనే పుస్త‌కంలో జిన్నా.. ప్లానింగ్ క‌మిటీని స్థాపించి.. అందులో భాగం కావాల‌ని అజీం హ‌షీం ప్రేమ్‌జీని ఆహ్వానించారు.

కానీ, వ్య‌క్తిగ‌త‌, వ్యాపార కార‌ణాల రీత్యా అందులో భాగ‌స్వామి కావ‌డానికి సీనియ‌ర్ ప్రేమ్‌జీ నిరాక‌రించార‌ని ఆ పుస్త‌కం పేర్కొంది. అయితే, ప్ర‌చారానికి దూరంగా ఉంటే ప్లానింగ్‌కు సేవ‌లందిస్తాన‌ని హామీ ఇచ్చార‌ట‌.

పాకిస్థాన్ తొలి క్యాబినెట్‌లో చేరేందుకూ తిర‌స్క్రుతి

మ‌రోమారు పాకిస్థాన్ తొలి క్యాబినెట్ ఏర్పాటు చేసిన‌ప్పుడూ.. ఆర్థిక మంత్రిగా సేవ‌లందించ‌డానికి రావాల‌ని జిన్నా చేసిన విజ్ఞ‌ప్తిని ప్రేమ్ జీ సీనియ‌ర్ నిరాక‌రించారు. వ్యాపార కార‌ణాల రీత్యా ఇండియాలోనే ఉండిపోవాల‌ని నిశ్చ‌యించుకున్నారట‌.

అజీం ప్రేమ్‌జీ కూడా డ్రాప‌వుట్‌.. ఎందుకంటే..

విప్రో అధినేత అజీం ప్రేమ్‌జీ కూడా కాలేజీ డ్రాప‌వుట్ అట‌. 1996లో కాలిఫోర్నియాలో స్టాన్‌ఫ‌ర్డ్ యూనివ‌ర్సిటీలో విద్యాభ్యాసం చేస్తున్న వేళ తండ్రి మ‌ర‌ణంతో అక‌స్మాత్‌గా చ‌దువాపేసి ఇండియాకు వ‌చ్చేశారు.

మల్టీ బిలియ‌న్ డాల‌ర్ల సంస్థ‌గా విప్రో

అప్పుడు అజీం ప్రేమ్‌జీ వ‌య‌స్సు 21 ఏండ్లు. తండ్రి మ‌ర‌ణంతో ఆయ‌న స్థానంలో వెస్ట్ర‌ల్ ఇండియా వెజిట‌బుల్ ప్రొడ‌క్ట్స్ చైర్మ‌న్‌గా బాధ్య‌త‌లు స్వీక‌రించారు.

ఇప్పుడు విప్రోగా మారిన ఈ సంస్థతో మ‌ల్టీ బిలియ‌న్ డాల‌ర్ల సంస్థ‌గా రూపుదిద్దారు.. ఆయ‌న ఆదాయంలో అత్య‌ధికంగా దాన ధ‌ర్మాల‌కే వినియోగిస్తున్నారు ప్రేమ్‌జీ.

ఇవి కూడా చదవండి:

హోంక్వారంటైన్‌లో ‘వకీల్‌సాబ్‌’

మరో రెండు రోజులు రాష్ట్రానికి వర్ష సూచన

కూచ్‌ బెహార్‌లో హింస.. ఈసీ కీలక నిర్ణయం
లులూగ్రూప్స్‌ చైర్మన్‌కు యూసఫ్‌ అలీ తృటిలో తప్పిన ప్రమాదం

బెంగాల్‌లో కేంద్ర హోంమంత్రి పర్యటన

ఉత్తరాఖండ్‌లో మళ్లీ కార్చిచ్చు..
దేశంలో కరోనా డేంజర్‌ బెల్స్‌.. 24గంటల్లో 1.53లక్షల కేసులు

తెలంగాణలో కొత్తగా 3,187 కరోనా కేసులు

ఢిల్లీలో ఘోర అగ్ని ప్రమాదం.. 250 దుకాణాలు బుగ్గి
మారిషస్‌లో పీవీ శతజయంతి ఉత్సవాలు ప్రారంభం

వ్యాక్సినేష‌న్ రికార్డు.. 85 రోజుల్లోనే 10 కోట్ల మందికి టీకా

ఐఫోన్ పాస్‌కోడ్ మ‌ర్చిపోయారా? ఇలా చేయండి
ఇదేం ఇండో-పాక్‌ యుద్ధం కాదు : సంజయ్‌ రౌత్
మ‌ళ్లీ ఇన్ఫీ షేర్ల బైబ్యాక్‌:14న నిర్ణ‌యం!
రాజ‌స్థాన్‌లో పెట్రోల్ బంకుల స‌మ్మె.. రీజ‌నేంటంటే?!
మాస్క్‌ ధరించకపోతే వెయ్యి జరిమానా
Advertisement
పాక్ తొలి ఆర్థిక మంత్రి చాన్స్‌కు నో.. ఎవ‌రంటే..!
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement