ఇదేం ఇండో-పాక్ యుద్ధం కాదు : సంజయ్ రౌత్
సంజయ్ రౌత్ |

ముంబై : కరోనాపై యుద్ధం జరుగుతోందని.. రాజకీయాలు చేసేందుకు ఇదేం ఇండో-పాక్ యుద్ధం కాదని శివసేన సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు సంజయ్ రౌత్ అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్, మాజీ ముఖ్యమంత్రి దేవేంద్రసింగ్ ఫడ్నవిస్ ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రజలు లాక్డౌన్ కోరుకోవడం లేదని తమకూ తెలుసునని.. కానీ, ప్రజల ప్రాణాలను కాపాడేందుకు పరిష్కారం ఏంటని? ప్రశించారు.
ఢిల్లీలో కూర్చున్న ప్రకాశ్ జవదేకర్ మాకు ఉపన్యాసాలు ఇవ్వొద్దని, మహారాష్ట్రకు వచ్చి పరిస్థితిని చూడాలన్నారు. ఆయనకు రాష్ట్రంతో సంబంధముందని, దీన్ని రాజకీయం చేయొద్దని సూచించారు. మహారాష్ట్రలో కొవిడ్ కేసుల సంఖ్య వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో సీఎం ఉద్ధవ్ ఠాకే శనివారం అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్త లాక్‌డౌన్‌పై చర్చ జరిగింది. ఇప్పటికే మహారాష్ట్రలో రాత్రిపూట కర్ఫ్యూ, వారాంతపు లాక్డౌన్ అమలులో ఉంది. వైరస్ కట్టడికి మూడువారాల పాటు కఠిన చర్యలు అవసరమని సీఎం ఠాక్రే స్పష్టం చేశారు.
ఈ క్రమంలో సంజయ్ రౌత్ మాట్లాడుతూ లాక్డౌన్ ఆమోదయోగ్యమైన చర్య అని అన్నారు. లాక్డౌన్ తప్ప మారే మార్గం లేదని.. కేసులు కేసులు మహారాష్ట్రకు మాత్రమే పరిమితం కాదని.. దేశవ్యాప్తంగా పెరుగుతున్నాయన్నారు. దేశానికి లాక్డౌన్ అవసరమా? కాదా? అనేది ప్రధాన మంత్రే నిర్ణయించగల విషయమని, పశ్చిమ బెంగాల్ ఎన్నికల షెడ్యూల్ తర్వాత కేంద్రం నిర్ణయం తీసుకుంటుందని తాను భావిస్తున్నట్లు చెప్పారు. టీకా డ్రైవ్, స్టాక్ పెంపు కేంద్రం బాధ్యతేనని స్పష్టం చేశారు. మహారాష్ట్ర టీకాల కొరతను ఎదుర్కొంటుందని అన్నారు.
ఇవి కూడా చదవండి..
మరో రెండు రోజులు రాష్ట్రానికి వర్ష సూచన
కూచ్ బెహార్లో హింస.. ఈసీ కీలక నిర్ణయం
లులూగ్రూప్స్ చైర్మన్‌కు యూసఫ్ అలీ తృటిలో తప్పిన ప్రమాదం
బెంగాల్లో కేంద్ర హోంమంత్రి పర్యటన
ఉత్తరాఖండ్‌లో మళ్లీ కార్చిచ్చు..
దేశంలో కరోనా డేంజర్ బెల్స్.. 24గంటల్లో 1.53లక్షల కేసులు
తెలంగాణలో కొత్తగా 3,187 కరోనా కేసులు
ఢిల్లీలో ఘోర అగ్ని ప్రమాదం.. 250 దుకాణాలు బుగ్గి
మారిషస్‌లో పీవీ శతజయంతి ఉత్సవాలు ప్రారంభం
వ్యాక్సినేషన్ రికార్డు.. 85 రోజుల్లోనే 10 కోట్ల మందికి టీకా
ఐఫోన్ పాస్‌కోడ్ మర్చిపోయారా? ఇలా చేయండి
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
రోడ్డు ప్రమాద మృతుల కుటుంబాలకు మాజీ ఎమ్మెల్యే చంద్రావతి పరామర్శ
బోనస్ ప్రకటించినా సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులకు అందని నగదు
MP Helen Haines: కారుతో అటాక్.. గాయపడ్డ ఆస్ట్రేలియా ఎంపీ
Singireddy Niranjan Reddy | రేవంత్ అసమర్థతో హరిగోస పడుతున్న రైతాంగం : మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
Iron Rod Pierces Boy’s Mouth | ఆడుతూ కిందపడిన బాలుడు.. నోటిలోకి చొచ్చుకెళ్లిన ఇనుప కడ్డీ
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

