బెంగాల్లో కేంద్ర హోంమంత్రి పర్యటన
బెంగాల్ | పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఎన్నికల నేపథ్యంలో ఆదివారం కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ఆరు బహిరంగ సభలు, రోడ్‌షోలో పాల్గొనున్నారు.

కోల్‌కతా : పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఎన్నికల నేపథ్యంలో ఆదివారం కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ఆరు బహిరంగ సభలు, రోడ్‌షోలో పాల్గొనున్నారు. మొదట మధ్యాహ్నం 12:20 గంటలకు శాంతిపూర్‌లో రోడ్‌షో నిర్వహించనున్నారు. అనంతరం 1:30 గంటలకు రణఘాట్ సౌత్‌లో రోడ్‌షో, మధ్యాహ్నం 3.40గంటలకు బాసిర్‌హాట్ సౌత్‌లో బహిరంగ సభలో పాల్గొంటారు. సాయంత్రం 04:25 గంటలకు పానిహతిలో రోడ్‌షోలో, సాయంత్రం 5:30 గంటలకు కమర్హతిలో టౌన్ హాల్ సమావేశం, రాత్రి 7:00 గంటలకు రాజర్హత్ గోపాల్పూర్ టౌన్ హాల్లో జరిగే మరో సమావేశంలో పాల్గొననున్నారు.
294 అసెంబ్లీ స్థానాలున్న వెస్ట్ బెంగాల్లో ఎనిమిది విడుతలుగా ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే నాలుగు విడుతల ఎన్నికలు పూర్తవగా.. 17న ఐదో విడుతలో 45 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగనుంది. 22న ఆరో విడతలో 43 స్థానాలకు, 26న ఏడో విడుతలో 35 నియోజకవర్గాలకు, 29న చివరి విడతలో 35 నియోజకవర్గాలకు జరుగనున్నాయి. మే 2న ఎన్నికల సంఘం ఫలితాలను ప్రకటించనుంది. పశ్చిమ బెంగాల్లో ఎన్నికలు అధికార టీఎంసీ, విపక్ష బీజేపీ మధ్య హోరాహోరీగా సాగుతున్నాయి.
ఇరు పార్టీల మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నాటి నుంచి ఎక్కడో ఒక చోట దాడులు, బాంబు పేలుళ్లు చోటు చేసుకుంటున్నాయి. శనివారం నాలుగో విడుత ఎన్నికల్లో హింస చెలరేగిన విషయం తెలిసిందే. భద్రతా బలగాల కాల్పుల్లో నలుగురు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఘటనపై కేంద్ర హోంశాఖపై సీఎం మమత ఆరోపణలు గుప్పించారు. హోంమంత్రి అమిత్‌షా రాజీనామాకు డిమాండ్ చేశారు. హింసకు సీఎం మమతే కారణమని ప్రధాని ఆరోపించారు.
ఇవి కూడా చదవండి..
మరో రెండు రోజులు రాష్ట్రానికి వర్ష సూచన
కూచ్ బెహార్లో హింస.. ఈసీ కీలక నిర్ణయం
ఢిల్లీలో ఘోర అగ్ని ప్రమాదం.. 250 దుకాణాలు బుగ్గి
మారిషస్‌లో పీవీ శతజయంతి ఉత్సవాలు ప్రారంభం
వ్యాక్సినేషన్ రికార్డు.. 85 రోజుల్లోనే 10 కోట్ల మందికి టీకా
ఐఫోన్ పాస్‌కోడ్ మర్చిపోయారా? ఇలా చేయండి
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

