ఢిల్లీలో ఘోర అగ్ని ప్రమాదం.. 250 దుకాణాలు బుగ్గి
ఢిల్లీలో అగ్ని ప్రమాదం | దేశ రాజధాని ఢిల్లీలోని శాస్త్రిపార్క్ ఫర్నిచర్ మార్కెట్లో శనివారం అర్ధరాతి జామున ఘోర అగ్ని ప్రమాదం జరిగింది.

న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలోని శాస్త్రిపార్క్ ఫర్నిచర్ మార్కెట్లో శనివారం అర్ధరాతి ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. సుమారు 250 ఫర్నిచర్, హార్డ్వేర్ దుకాణాలకు మంటలు వ్యాపించాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది 32 ఫైర్ టెండర్లను సంఘటనా స్థలానికి చేరుకొని నాలుగు గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకువచ్చాయి. అలాగే మంటల్లో చిక్కుకున్న ఎనిమిది మందిని రక్షించారు. ఈ సందర్భంగా ఫైర్ సర్వీసెస్ అసిస్టెంట్ డివిజనల్ ఆఫీసర్ రాజేశ్ శుక్లా మాట్లాడుతూ.. శనివారం అర్ధరాత్రి 12.45 గంటలకు మంటలు చెలరేగాయని సమాచారం వచ్చిందని తెలిపారు.

ఈ మేరకు వెంటనే 32 ఫైర్ టెండర్లను తరలించినట్లు చెప్పారు. ఆదివారం వేకువ జామున 3గంటల ప్రాంతంలో మంటలను అదుపులోకి తీసుకువచ్చినట్లు పేర్కొన్నారు. రెస్క్యూ ఆపరేషన్లో ఎనిమిది మందిని రక్షించినట్లు వివరించారు. ప్రమాదంలో సుమారు 250 ఫర్నిచర్, హార్డ్వేర్ దుకాణాలకు మంటలు వ్యాపించగా.. అందులోని సామగ్రి అగ్నికి ఆహుతైంది. అయితే, అగ్ని ప్రమదానికి గల కారణాలు తెలియరాలేదు.
ఇవి కూడా చదవండి..
మరో రెండు రోజులు రాష్ట్రానికి వర్ష సూచన
కూచ్ బెహార్లో హింస.. ఈసీ కీలక నిర్ణయం
మారిషస్లో పీవీ శతజయంతి ఉత్సవాలు ప్రారంభం
వ్యాక్సినేషన్ రికార్డు.. 85 రోజుల్లోనే 10 కోట్ల మందికి టీకా
ఐఫోన్ పాస్కోడ్ మర్చిపోయారా? ఇలా చేయండి
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

