ఐఫోన్ పాస్‌కోడ్ మర్చిపోయారా? ఇలా చేయండి
ఐఫోన్ పాస్‌కోడ్ | ఐఫోన్ పాస్‌కోడ్ తప్పుగా ఎంటర్ చేసినప్పుడు ఫోన్ డిసేబుల్ అయిపోతుంది. ఎంతసేపటికీ ఫోన్ ఓపెన్ కాదు. అలాంటప్పుడు టెన్షన్ అక్కర్లేదు.

ఇప్పుడు ఫోన్లు కేవలం కాల్స్ మాట్లాడటానికే కాదు! బ్యాంకు లావాదేవీలు మొదలు ఆన్ లైన్ షాపింగ్, ఆన్ లైన్ క్లాసులు, ఏదైనా సమాచారం కావాలన్నా అన్నింటికీ అరచేతిలో అందుబాటులో ఉండే స్మార్ట్‌ఫోన్‌నే వాడుతుంటాం. ఇలా ప్రతిదానికీ వాడుతుంటాం కాబట్టే భద్రత కోసం స్మార్ట్ ఫోన్‌కు లాక్ వేస్తుంటాం. ఒకవేళ ఆ పాస్ వర్డ్ మర్చిపోతే ఎలా? మనం పాస్వర్డ్ మరిచిపోకున్నా సరే ఒక్కోసారి పిల్లలు ఫోన్ ఓపెన్ చేసేందుకు ఏదో ఒకటి నొక్కుతుంటారు. ఇలా పదే పదే చేయడం వల్ల ఫోన్ లాక్ అయిపోతుంది. అదే ఐఫోన్ పాస్‌కోడ్ తప్పుగా ఎంటర్ చేసినప్పుడు ఫోన్ డిసేబుల్ అయిపోతుంది. ఎంతసేపటికీ ఫోన్ ఓపెన్ కాదు. అలాంటప్పుడు ఏం చేయాలని టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. చిన్న టెక్నిక్ పాటిస్తే డిసేబుల్ అయిన మీ ఐఫోన్ ను తిరిగి ఓపెన్ చేయొచ్చు. అదెలాగో ఇప్పుడు చూద్దాం..

ఐఫోన్ పాస్‌కోడ్ రిమూవ్ చేయాలి
పాస్‌కోడ్ రిమూవ్ చేయడానికి ముందుగా మీ ఐఫోన్‌ను రీస్టార్ట్ చేయాలి. రీస్టార్ట్ అవుతున్న సమయంలో ఐఫోన్‌ను కంప్యూటర్‌కు కనెక్ట్ చేసి రికవరీ మోడ్ ఓపెన్ చేయాలి. అంతకంటే ముందు మీ కంప్యూటర్లో ఐట్యూన్స్ యాప్ ఓపెన్ చేసి ఉంచుకోవాలి.
- ఐఫోన్ 8 అంతకంటే పై మోడల్స్ వాడుతున్నట్లయితే.. ఫోన్ రీస్టార్ట్ అవుతున్న సమయంలో సైడ్ బటన్ నొక్కి పట్టుకోవాలి. అలాగే కాసేపు నొక్కి పట్టుకుంటే రికవరీ మోడ్ ఓపెన్ అవుతుంది.
- అదే ఐఫోన్ 7, ఐఫోన్ 7 ప్లస్ వాడుతున్నట్లయితే.. ఫోన్ రీస్టార్ట్ అయ్యేటప్పుడు వాల్యూమ్ డౌన్ బటన్‌ను నొక్కి పట్టుకోవాలి. రికవరీ మోడ్ ఓపెన్ అయ్యే వరకు ఆ బటన్ నొక్కి పట్టుకోవాలి.
- ఇక ఐఫోన్ 6s, ఐఫోన్ SE వాడుతున్నట్లయితే ఫోన్ రీస్టార్ట్ అవుతున్నప్పుడు హోం స్క్రీన్ బటన్ నొక్కి పట్టుకుంటే రికవరీ మోడ్ ఓపెన్ అవుతుంది.

ఐఫోన్ రికవరీ మోడ్‌లోకి వెళ్లగానే కంప్యూటర్ స్క్రీన్ పై There is a problem with iphone that requires it to be updated or restored అని పాప్ అప్ వస్తుంది. అప్పుడు రీస్టోర్ ఆప్షన్‌ను ఎంచుకోవాలి.
ఇవి గుర్తుపెట్టుకోవాలి
- ఫోన్ రీస్టోర్ అవుతున్న సమయంలో కంప్యూటర్ నుంచి ఐఫోన్‌ను ఎట్టిపరిస్థితుల్లో డిస్ కనెక్ట్ చేయకూడదు.
- రీస్టోర్ ప్రక్రియ పూర్తయ్యే వరకు ఐఫోన్‌ను ఉపయోగించకూడదు.
- రీస్టోర్ ప్రక్రియ పూర్తి కావడానికి కొద్ది సమయం పడుతుంది. అలాగని 15 నిమిషాలు దాటినా రీస్టోర్ పూర్తి కాకుంటే.. పై ప్రాసెస్‌ను మళ్లీ మొదటి నుంచి చేయాల్సి ఉంటుంది.
- ఇలా రికవరీ చేసినప్పుడు ఐఫోన్లో ఉన్న డేటా మొత్తం డిలీట్ అవుతుంది. అయితే ఐక్లౌడ్ బ్యాకప్ ద్వారా మళ్లీ డేటాను రీస్టోర్ చేసుకోవచ్చు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
Fake Facebook Account : మీ పేరుతో నకిలీ ఫేస్బుక్ ఖాతా ఉందా? ఇలా డిలీట్ చేయండి
Joker Malware : హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ చెప్పిన జోకర్ ఎంత ప్రమాదకరం.. అది ఏం చేస్తుంది
వాట్సాప్ లో ఈ తప్పులు అస్సలు చేయొద్దు
గూగుల్‌లో వీటిని అసలు సెర్చ్ చేయకూడదు!
గూగుల్‌లో వీటిని అసలు సెర్చ్ చేయకూడదు!
స్మార్ట్ ఫోన్ లోనే బ్లడ్ ఆక్సిజన్ లెవల్స్ …!
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

