ముంబై: కరోనా నేపథ్యంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) తమ ఖాతాదారులకు రిలీఫ్‌నిచ్చింది. నాన్-హోం శాఖల్లో కస్టమర్లు నగదు విత్ డ్రాయల్ చేసుకునే పరిమితిని పెంచింది. చెక్‌లు, విత్‌డ్రాయల్ ఫామ్స్ మీద విత్ డ్రా చేసుకునే మొత్తాన్ని పెంచింది.
కరోనా వేళ తమ కస్టమర్లకు మద్దతుగా నిలువాలని నిర్ణయించుకున్నామని ఎస్బీఐ శనివారం ఓ ట్వీట్లో తెలిపింది. ఖాతాదారులు తన నాన్ హోం శాఖల్లో చెక్‌లు లేదా విత్‌డ్రా ఫామ్‌ల ద్వారా నగదు విత్‌డ్రాయల్ పరిమితి పెంచుతున్నామని తెలిపింది.
సెల్ఫ్‌గా చెక్‌తో ఒక రోజుకు రూ. లక్ష విత్ చేసుకునేందుకు అనుమతిస్తున్నట్లు తెలిపింది. పాస్‌బుక్‌తో కలిసి విత్ డ్రాయల్ ఫాంపై రోజుకు రూ.25 వేలు విత్‌డ్రా చేసుకోవచ్చు. థర్డ్ పార్టీ విత్ డ్రాయల్స్లో చెక్ ద్వారా రూ.50 వేల వరకు ఉపసంహరించుకోవచ్చు.
థర్డ్ పార్టీలకు విత్‌డ్రాయల్ ఫామ్స్‌పై నగదు చెల్లింపులు ఉండవని తెలిపింది. అలా చేయాల్సి వస్తే థర్డ్ పార్టీ.. కేవైసీ పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది. ఈ సడలింపులు సెప్టెంబర్ నెలాఖరు వరకు ఉంటాయని వివరించింది.
To support our customers in this pandemic, SBI has increased the non-home cash withdrawal limits through cheque and withdrawal form.
— State Bank of India (@TheOfficialSBI) May 29, 2021
#SBIAapkeSaath #StayStrongIndia #CashWithdrawal #Covid19 #BankSafe #StaySafe pic.twitter.com/t4AXY4Rzqh
మహమ్మారి అంతంపై డబ్ల్యూహెచ్ఓ కీలక వ్యాఖ్యలు
రాందేవ్ వ్యాఖ్యలపై ఆగని రగడ : చర్చకు రావాలని ఐఎంఏ సవాల్
అంత్యక్రియలు జరిపాక.. మనిషి తిరిగొచ్చాడు..! అసలేం జరిగిందంటే
బ్యాంకుల్లో డబ్బు డిపాజిట్లకు ఇన్సూరెన్స్ ఉంటుందా ?
ప్రతి నెల గ్యాస్ బండ ధర మోతే.. ఇంకా..!
ఐటీ రూల్స్ సరే.. వాట్సాప్ ప్రైవసీ పాలసీ కట్టడి మాటేంటి?!
చైనాలో ప్రత్యక్షమైన శ్రీలంక యువరాణి.. మంటలు రేపుతున్న వింత కథనాలు