థానేలో కూలిన బిల్డింగ్ పైకప్పు.. ఏడుగురు మృతి
థానేలో కూలిన బిల్డింగ్ పైకప్పు.. ఏడుగురు మృతి | హారాష్ట్రలోని థానేలో ఘోర ఘటన చోటు చేసుకుంది. థానేలోని ఉల్హాస్‌నగర్‌లో శుక్రవారం రాత్రి ఓ బిల్డింగ్ పైకప్పు కూలిపోయింది. ఈ ఘటనలో ఏడుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు.

ముంబై : మహారాష్ట్రలో ఘోర ఘటన చోటు చేసుకుంది. థానేలోని ఉల్హాస్‌నగర్‌లో శుక్రవారం రాత్రి ఓ బిల్డింగ్ పైకప్పు కూలిపోయింది. ఈ ఘటనలో ఏడుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఐదారుగురు వ్యక్తులు శిథిలాల కింద చిక్కుకుపోయినట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు భవనం శిథిలాల నుంచి ఏడు మృతదేహాలు వెలికి తీసినట్లు థానే మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు పేర్కొన్నారు. శిథిలాల కింద మరికొందరు చిక్కుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు. సహాయక చర్యలు కొనసాగిస్తున్నట్లు చెప్పారు.

ఉల్లాస్‌నగర్‌లోని నెహ్రూచౌక్ వద్ద ఉన్న ఈ భవనం ఐదో అంతస్థు నుంచి గ్రౌండ్ ఫ్లోర్ వరకు పైకప్పు కూలిపోయింది. రాత్రి 9.30 గంటల సమయంలో ఘటన జరిగిందని అధికారులు పేర్కొన్నారు. మున్సిపల్ కార్పొరేషన్, అగ్నిమాపకశాఖ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. అయితే, మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని, శిథిలాల కింద ఎంత మంది చిక్కుకున్నారో తెలియలేదని అధికారులు తెలిపారు.
ఇవి కూడా చదవండి..
విమానంలో గబ్బిలం.. అత్యవసర ల్యాండింగ్
మహమ్మారి అంతంపై డబ్ల్యూహెచ్ఓ కీలక వ్యాఖ్యలు
29-05-2021 శనివారం.. మీ రాశి ఫలాలు
అధిక ఫీజు వసూలు.. 64 ఆస్పత్రులకు ప్రభుత్వం నోటీసులు
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AB de Villiers | వయసు పైబడినా చేవ తగ్గలే.. 37 బంతుల్లోనే డివిలియర్స్ శతకమోత..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడు ఈదురు జనార్ధన్ కుటుంబానికి అండగా కేటీఆర్.. వీడియో
KTR Letter | రేడియల్ రోడ్ 2 టెండర్లలో జరిగిన రూ. 3,296 కోట్ల కుంభకోణంపై సమాధానం చెప్పాలి : రేవంత్‌కు కేటీఆర్ లేఖ
విద్యుత్ తీగలకు అడ్డమని పచ్చని చెట్ల నరికివేత
బోండాల కోసం కొబ్బరి చెట్టు నరికివేత.. వ్యక్తి పట్టివేత
ట్రెండింగ్ వార్తలు
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!

