మళ్లీ పెరిగిన పెట్రోల్ ధరలు.. ముంబైలో సెంచరీ
మళ్లీ పెరిగిన పెట్రోల్ ధరలు.. ముంబైలో సెంచరీ | వాహనదారులకు చమరు కంపెనీలు షాక్ ఇస్తూనే ఉన్నాయి. ఇప్పటికే రికార్డు స్థాయికి చేరగా.. తాజాగా లీటర్ పెట్రోల్‌పై 28 పైసలు, లీటర్ డీజిల్‌లో 26 పైసలు పెంచాయి.

న్యూఢిల్లీ : వాహనదారులకు చమరు కంపెనీలు షాక్ ఇస్తూనే ఉన్నాయి. ఇప్పటికే రికార్డు స్థాయికి చేరగా.. తాజాగా లీటర్ పెట్రోల్‌పై 28 పైసలు, లీటర్ డీజిల్‌పై 26 పైసలు పెంచాయి. రాజస్థాన్‌లోని శ్రీగంగానగర్, మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌పై లీటర్ పెట్రోల్ ధర రూ.100 దాటగా.. కొత్తగా దేశ ఆర్థిక రాజధాని ముంబైలో లీటర్ పెట్రోల్ ధర సెంచరీ కొట్టింది. ఇంతకు ముందు గురువారం ధరలు పెరగ్గా.. శుక్రవారం విరామం తర్వాత శనివారం ధరలు పైకి కదిలాయి. తాజాగా పెంచిన ధరలతో ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.93.94, లీటర్ డీజిల్ రూ.84.89కి చేరాయి. ముంబైలో లీటర్ పెట్రోల్ రూ.100.19, డీజిల్ రూ.92.17కు పెరిగింది. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర.97.63, లీటర్ డీజిల్ రూ.92.54కు చేరింది.
పెట్రోల్‌పై రూ.3.61.. డీజిల్‌పై రూ.4.11 పెంపు
గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు పెట్రోల్ ధరలు నిలకడగా కొనసాగుతూ వచ్చాయి. ఎన్నికల ఫలితాలు ఈ నెల 2న వెలువడగా.. ఆ తర్వాత రోజు నుంచి ఇంధన ధరలు పెరుగుతూ వస్తున్నాయి. గత నెలలో ముడి చమురు ఖరీదైన తర్వాత సైతం పెట్రోల్, డీజిల్ రేట్లు పెరుగలేదు. అయితే, ముడి చమురు రేట్లు తగ్గిన అనంతరం పెట్రోల్, డీజిల్‌పై నాలుగుసార్లు తగ్గించారు. దీంతో పెట్రోల్ లీటర్‌కు 77 పైసలు, డీజిల్‌పై 74 పైసలు వరకు తగ్గించాయి. ఈ నెలలో ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం వరుసగా, రోజువిడిచి రోజు చమురు కంపెనీలు ధరలను పెంచుతూ వస్తున్నాయి.
ఇప్పటి వరకు 15 సార్లు ధరలు పెరగ్గా.. లీటర్ పెట్రోల్‌పై రూ.3.61, డీజిల్‌పై రూ.4.11 పెంచాయి. ఇదిలా ఉండగా.. ఒపెక్ దేశాల మంత్రివర్గ సమావేశం జూన్ 1న జరుగనుంది. రాబోయే జూలైలో ముడి చమురు ఉత్పత్తిని పెంచుతారనే ఊహాగానాలున్నాయి. దీంతో ముడి చమురు మార్కెట్ ధరలు శుక్రవారం స్థిరంగా కొనసాగాయి. యూఎస్ మార్కెట్లో బ్రెంట్ ముడి శుక్రవారం బ్యారెల్‌కు 69.46 డాలర్లు పలికింది. డబ్ల్యూటీఐ క్రూడ్ బ్యారెల్‌కు 0.53 డాలర్లు తగ్గి.. 66.32 డాలర్లకు చేరుకుంది.
ప్రధాన నగరాల్లో ధరలు ఇలా..
ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ.93.94.. డీజిల్ 84.89
ముంబైలో లీటర్ పెట్రోల్ రూ.100.19.. డీజిల్ రూ.92.17
చెన్నైలో లీటర్ పెట్రోల్ రూ.95.51.. డీజిల్ రూ.89.65
కోల్‌కతాలో లీటర్ పెట్రోల్ రూ.93.97.. డీజిల్ రూ.87.74
భోపాల్‌లో లీటర్ పెట్రోల్ రూ.102.04.. డీజిల్ 93.37
రాంచీలో లీటర్ పెట్రోల్ రూ.90.62.. డీజిల్ రూ.89.64
బెంగళూరులో లీటర్ పెట్రోల్ రూ.97.07.. డీజిల్ రూ.89.99
పాట్నాలో లీటర్ పెట్రోల్ రూ.96.10.. డీజిల్ రూ.90.16
చండీగఢ్‌లో లీటర్ పెట్రోల్ రూ.90.36, డీజిల్ రూ.84.55
లక్నోలో లీటర్ పెట్రోల్ రూ.91.41.. డీజిల్ రూ.85.28
హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ రూ.97.63, డీజిల్ రూ.92.54
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Congress Leaders | బతుకమ్మ పండుగ వేళ.. కాంగ్రెస్ నేతల డిష్యుం డిష్యుం
Fake Number Plates | రూల్స్ బ్రేక్ చేసేందుకు.. ఫేక్ నంబర్ ప్లేట్లపై పోలీసుల ఫోకస్
Devaragattu Banni Utsavam | దసరా వేళ కర్రల సమరం.. దేవరగట్టు బన్నీ ఉత్సవం వెనుక అసలు కథ ఇదే!
Cabinet Expansion | దసరాకు పక్కా అంటూ కాంగ్రెస్ నేతల ప్రచారం.. కానీ ఆ ఊసేలేదు
Polluted Cities | ప్రపంచ అత్యంత కాలుష్య నగరాలు.. ఒక్క భారత్‌లోనే ఎన్ని ఉన్నాయంటే..?
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

