న్యూఢిల్లీ: మీకు ఏదైనీ బ్యాంకులో ఖాతా ఉందా..! అకస్మాత్‌గా ఆ బ్యాంకు సంక్షోభంలో చిక్కుకుందా.. అప్పుడు నిబంధనల ప్రకారం మీకు రూ.5 లక్షల గ్యారంటీ లభిస్తుంది. కానీ దేశంలోని 4.8 కోట్ల ఖాతాలకు ఈ గ్యారంటీ లేదు. అయితే, 247.8 కోట్ల ఖాతాలకు ఈ గ్యారంటీ ఉంది.
ఒకవేళ మీరు ఒక కోపరేటివ్ బ్యాంకులో డబ్బు డిపాజిట్ చేశావనుకో. డిపాజిట్ ఇన్సూరెన్స్ పథకంలో సదరు బ్యాంకు పేరు రిజిస్టర్ చేశారో.. లేదో ముందుగా తెలుసుకోవాలి. https://www.dicgc.org.in/ అనే వెబ్సైట్లోకి వెళ్లి, ఈ విషయాన్ని నిర్దారించుకోవచ్చు.
బ్యాంకు ఫెయిలైనా, సంక్షోభంలో చిక్కుకున్నా మీరు డిపాజిట్ చేసిన డబ్బుకు బీమా సౌకర్యం ఉంది. అదే డీఐసీజీసీ. దీనికింద గత 50 ఏండ్లుగా రూ. లక్ష వరకు గ్యారంటీ ఉంది. కానీ కొన్ని బ్యాంకులు ఇబ్బందుల్లో చిక్కుకోవడంతో గత ఫిబ్రవరి నుంచి దీన్ని రూ.5 లక్షలకు పెంచుతూ ఆర్బీఐ నిర్ణయం తీసుకున్నది.
డీఐసీజీసీ అంటే డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ (డీఐసీజీసీ).. దీనికింద నమోదైన బ్యాంకుల్లో డిపాజిట్ చేసుకున్న వారికి మాత్రమే ఇన్సూరెన్స్ కవరేజీ ఉంటుంది.
దేశంలోని వివిధ బ్యాంకుల్లో 252.6 కోట్ల ఖాతాలు ఉన్నాయి. 2021 మార్చి నెలాఖరు నాటికి 247.8 కోట్ల ఖాతాలకు పూర్తి రక్షణ ఉంది. బ్యాంకుల్లోని మొత్తం ఖాతాల్లో ఇది 98.1 శాతం. మిగతా 4.8 కోట్ల ఖాతాలకు డీఐసీజీసీ కవరేజీ లేదు.
247.8 బ్యాంకు ఖాతాలకు రూ.76,21,258 కోట్ల ఇన్సూరెన్స్ లభిస్తుంది. ఖాతాలకు ఇన్సూరెన్స్ ఉన్నా, అది రూ.5 లక్షలకు పెంచినా.. మొత్తం డిపాజిట్లకు వర్తించదు. ఉదాహరణకు మీరు రూ.25 లక్షలు డిపాజిట్ చేసిన బ్యాంకు నష్టాల్లో చిక్కుకుంటే రూ.5 లక్షలు మాత్రమే వస్తాయి. మిగతా రూ.20 లక్షలకు నో గ్యారంటీ.
ఆర్బీఐ వార్షిక నివేదిక ప్రకారం ఐదు సహకార, ఒక స్థానిక ప్రాంతీయ బ్యాంకు ఫెయిలయ్యాయి. అన్ అడిటెడ్ డేటా ప్రకారం 2020-21లో ప్రస్తుత కరోనా మహమ్మారి వేళ డీఐసీజీసీ.. బ్యాంకుల ఖాతాదారుల క్లెయిమ్‌ల ప్రకారం రూ.993 కోట్ల చెల్లింపునకు ప్రక్రియ పూర్తి చేసింది.
తొమ్మిది కోపరేటివ్ బ్యాంకులతోపాటు మొత్తం బ్యాంకుల ఖాతాల్లో క్లయిమ్ చేసిన రూ.993 కోట్లలో 2020-21లో రూ.564 కోట్లు సెటిల్ చేశారు. గత నెలలో ఒక కోఆపరేటివ్ బ్యాంక్ రూ.330 కోట్ల చెల్లింపులు పూర్తి చేసింది.
డీఐసీజీసీలోకి అన్ని వాణిజ్య బ్యాంకులను చేర్చారు. మార్చి నెలాఖరు నాటికి ఇందులో 2058 బ్యాంకులు రిజిస్టర్ అయ్యాయి. వీటిలో 139 వాణిజ్య బ్యాంకులు ఉన్నాయి. వాటిలో 43 రీజనల్ రూరల్ బ్యాంకులు, రెండు లోకల్ ఏరియా బ్యాంకులు, ఆరు పేమెంట్ బ్యాంకులు, 10 స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు ఉన్నాయి.
డీఐసీజీసీలో ఆర్బీఐ నివేదిక ప్రకారం 1,919 కోఆపరేటివ్ బ్యాంకులు రిజిస్టరయ్యాయి. వాటిలో 34 స్టేట్ కోఆపరేటివ్ బ్యాంకులు, 347 డీసీసీబీలు, 1,538 అర్బన్ కోఆపరేటివ్ బ్యాంకులు ఉన్నాయి.
ప్రతి నెల గ్యాస్ బండ ధర మోతే.. ఇంకా..!
అల్లోపతితోనే కరోనా పూర్తి నివారణ పెద్ద అబద్ధం.. రాందేవ్ సంచలనం!!
టాటా గ్రూప్ చేతికి ఆన్లైన్ సరుకుల బిగ్ బాస్కెట్
సరికొత్త రికార్డు తాకిన నిఫ్టీ…
పేటీఎం భారీ ఐపీవో రూ.21,800 కోట్ల సమీకరణ
ఎన్ఐఏ అదుపులో అనుమానిత ఐసిస్ ఉగ్రవాది
రాబర్ట్ వాద్రాకు ఊరట : ఐటీ నోటీసులపై బదులిచ్చేందుకు మరో మూడు వారాల గడువు
31 కోట్లతో డ్యూప్లెక్స్ అపార్ట్మెంట్ కొన్న బిగ్ బీ
ఆయన ఓ ఫైవ్ స్టార్ పొలిటీషియన్ : బీజేపీ
2డీజీ డ్రగ్ సాచెట్ ఖరీదు రూ 990
జాతీయ జెండాను కేజ్రీవాల్ అవమానించారు : కేంద్రమంత్రి
corona helpline : కరోనా బాధితుల కోసం హెల్ప్‌లైన్ నంబర్లు ఇవే..