e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, June 13, 2021
Home News 31 కోట్ల‌తో డ్యూప్లెక్స్ అపార్ట్‌మెంట్ కొన్న‌ బిగ్ బీ

31 కోట్ల‌తో డ్యూప్లెక్స్ అపార్ట్‌మెంట్ కొన్న‌ బిగ్ బీ

31 కోట్ల‌తో డ్యూప్లెక్స్ అపార్ట్‌మెంట్ కొన్న‌ బిగ్ బీ

ముంబై : ఇప్ప‌టికే ముంబైలో ఐదు ఆస్తుల‌ను క‌లిగి ఉన్న బిగ్ బీ అమితాబ్ బ‌చ్చ‌న్‌.. ఇప్పుడు మ‌రో ఆస్తిని కొనుగోలు చేశారు. ఈ డ్యూప్లెక్స్ అపార్ట్‌మెంట్‌ను రూ.31 కోట్లకు కొనుగోలు చేసిన‌ట్లు మార్కెట్ వ‌ర్గాల స‌మాచారం. టైర్ -2 బిల్డర్ క్రిస్టల్ గ్రూప్ నుండి తమ అట్లాంటిస్ ప్రాజెక్టులో కొనుగోలు చేసినట్లు చెప్తున్నారు.

ముంబైలో 5,184 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న డ్యూప్లెక్స్ అపార్ట్‌మెంట్‌ను అమితాబ్ బ‌చ్చ‌న్‌ కొనుగోలు చేశారు. ఈ ఆస్తిని 2020 డిసెంబర్‌లో కొనుగోలు చేయ‌గా.. 2021 ఏప్రిల్‌లో రిజిస్ట్రేష‌న్ జరిగింది. బిగ్ బీ ఈ ఆస్తిని టైర్ -2 బిల్డర్ క్రిస్టల్ గ్రూప్ అట్లాంటిస్ ప్రాజెక్టులో కొనుగోలు చేసినట్లు స‌మాచారం. 27, 28 అంతస్తులలో ఉన్న ఈ డ్యూప్లెక్స్ అపార్ట్‌మెంట్‌తో 6 కార్ల‌ను పార్కింగ్ చేసే అవ‌కాశం లభిస్తుంది. ఈ ప్రాజెక్టులో సన్నీ లియోన్ రూ.16 కోట్ల విలువైన ఇంటిని కొనుగోలు చేయగా, దర్శకుడు ఆనంద్ ఎల్ రాయ్ కూడా రూ.25.3 కోట్ల ఆస్తిని కొనుగోలు చేశారు.

ముంబైలో అమితాబ్ బచ్చన్‌కు ఇప్పటికే 5 బంగ్లాలు ఉన్నాయి. 10,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ‘జల్సాస‌లో కుటుంబంతో నివసిస్తున్నారు. రెండవ బంగ్లా ‘వెయిటింగ్’.. ‘జల్సా’ కి రావ‌డానికి ముందు ఈ బంగ్లాలో నివసించారు. మూడవ బంగ్లా ‘జనక్స‌.. ఇక్కడ అమితాబ్‌ కార్యాలయం ఉన్న‌ది. నాలుగో బంగ్లా వాట్సా.. దీనిని బ్యాంకుకు లీజుకు ఇచ్చాడు. వీటితో పాటు 2013 లో ‘జల్సా’ వెనుక వైపున్న రూ.60 కోట్ల విలువైన బంగ్లా కూడా కొనుగోలు చేశారు.

ఇవి కూడా చ‌ద‌వండి..

ఇమ్యూనిటీ కోసం జింక్ ల‌భించే 5 ఆహారాలు..

భార‌త్‌లో 5 జీ ట్రయల్స్‌కు మార్గం సుగ‌మం

మ‌హిళ‌ల ఆరోగ్యానికి సూప‌ర్ ఫుడ్స్‌..!

రా, ఐబీ చీఫ్ ప‌ద‌వీకాలం పొడ‌గింపు

‘వీర్ సావర్కర్’ సినిమాను ప్ర‌క‌టించిన సందీప్‌, అమిత్ వాద్వానీ

న‌టసార్వ‌భౌముడు పుట్టింది ఇవాళే.. చ‌రిత్ర‌లో ఈరోజు

జూలై 5 న‌ అమెజాన్ సీఈఓ ప‌ద‌వికి గుడ్‌బై చెప్ప‌నున్న‌ జెఫ్ బెజోస్

తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ , ట్విటర్‌టెలిగ్రామ్‌ ను ఫాలో అవండి..

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
31 కోట్ల‌తో డ్యూప్లెక్స్ అపార్ట్‌మెంట్ కొన్న‌ బిగ్ బీ

ట్రెండింగ్‌

Advertisement