వాషింగ్టన్ : అమెజాన్ కంపెనీ సీఈఓ పదవి నుంచి తప్పుకునేందుకు ఆ సంస్థ వ్యవస్థాపకుడు జెఫ్ బోజెస్ సిద్ధమయ్యారు. జూలై 5 న అధికారికంగా ఈ పదవిని వీడనున్నారు. సరిగ్గా సంస్థను స్థాపించిన 27 ఏండ్లకు సీఈఓ పదవి నుంచి జెఫ్ బెజోస్ తప్పుకుంటున్నారు. అమెజాన్ కొత్త సీఈఓగా సెకండ్ ఎగ్జిక్యూటివ్, జెఫ్ సలహాదారు అయిన ఆండీ జెస్సీ నియమితులు కానున్నారు. అయితే, బెజోస్ కంపెనీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా కొనసాగుతారు.
జెఫ్ బెజోస్ ఇంటర్నెట్తో పుస్తకాలను విక్రయించడం ద్వారా అమెజాన్ సంస్థను జెఫ్ బెజోస్ 27 సంవత్సరాల క్రితం ప్రారంభించారు. ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి సంస్థను ప్రపంచంలోనే మేటి సంస్థగా తీర్చిదిద్దారు. కంపెనీ సీఈఓ పదవిని వీడుతున్నట్లు జెఫ్ బెజోస్ తీవ్ర ఉద్వేగం మధ్య ఇటీవల ప్రకటించారు. సంస్థ కొత్త సీఈఓగా తన ఆర్థిక సలహాదారుగా ఉన్న ఆండీ జెస్సీని నియమించారు. ఆండీ జెస్సీ జూలై 5న సీఈఓ బాధ్యతలు స్వీకరించనున్నారు.
జెఫ్ బెజోస్.. ఎర్త్ ఫండ్, బ్లూ ఆరిజిన్ స్పేస్ షిప్ కంపెనీ, అమెజాన్ డే వన్ ఫండ్, ది వాషింగ్టన్ పోస్ట్ వంటి ఇతర వెంచర్లపై దృష్టి పెట్టాలని యోచిస్తున్నట్లు ఆయన చెప్పారు. 57 ఏండ్ల వయసున్న బెజోస్ నికర ఆస్తి విలువ ప్రస్తుతం 189 బిలియన్ డాలర్లు. హాలీవుడ్ స్టూడియో మెట్రో-గోల్డ్విన్-మేయర్ (ఎంజీఎం) ను 8.45 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేస్తానని బుధవారం వెల్లడించారు. వీడియో స్ట్రీమింగ్ సేవలతో మరిన్నిసినిమాలను ప్రదర్శించేందుకు ఎంజీఎం ప్లాన్ చేసింది. అన్ని జేమ్స్ బాండ్ చిత్రాల హక్కులను ఎంజీఎం స్టూడియోస్ కలిగి ఉన్నది. ఆపిల్, కామ్‌కాస్ట్ వంటి ఇతర కొనుగోలుదారుల కంటే 40 శాతం ఎక్కువ చెల్లించడం ద్వారా ఎంజీఎంతో ఒప్పందం జరిగినట్లుగా తెలుస్తున్నది.
భారత్‌లో యాంటీబాడీ కాక్టెయిల్తో చికిత్స .. కరోనా నుంచి కోలుకున్న హర్యానా వాసి
కొవిడ్ నివారణలో ‘సెనోటైజ్’ 99 శాతం ప్రభావవంతం : గిల్లి రిగెవ్
భారత తొలి ప్రధాని నెహ్రూ కన్నుమూత.. చరిత్రలో ఈరోజు
వ్యాక్సిన్ నిలపాలంటూ పిటిషన్.. పిటిషన్‌దారుకు 50 వేల జరిమానా..
భారత్‌లో 130 రోజుల్లో 20 కోట్ల మందికి వ్యాక్సిన్
సముద్రంలో అరుదైన ఖనిజాలను కనుగొన్న జపాన్
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..