వ్యాక్సిన్ నిలపాలంటూ పిటిషన్.. పిటిషన్‌దారుకు 50 వేల జరిమానా..
కొవిడ్-19 టీకాను నిలిపివేయాలంటూ దాఖలైన పిటిషన్‌ను కర్ణాటక హైకోర్టు బుధవారం కొట్టివేసింది. విషయంలేని, ప్రజలకు ఏమాత్రం ఉపయోగంలేని పిటిషన్లు వేసి కోర్టు విలువైన సమయాన్ని వృథా చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది

బెంగళూరు : కొవిడ్-19 టీకాను నిలిపివేయాలంటూ దాఖలైన పిటిషన్‌ను కర్ణాటక హైకోర్టు బుధవారం కొట్టివేసింది. విషయంలేని, ప్రజలకు ఏమాత్రం ఉపయోగంలేని పిటిషన్లు వేసి కోర్టు విలువైన సమయాన్ని వృథా చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతేకాకుండా, పిటిషన్‌దారుకు రూ.50 వేల జరిమానా విధించింది. నెల రోజుల్లోపుగా ఈ మొత్తాన్ని ముఖ్యమంత్రి సహాయ నిధికి జమచేయాలని కర్ణాటక హైకోర్టు ఆదేశించింది.
రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న వ్యాక్సిన్లు వేసే కార్యక్రమం లోపభూయిష్టంగా ఉంటున్నందున వెంటనే టీకాలు వేయడాన్ని నిలుపుదల చేయాలని ముగ్గురు ప్రజాప్రయోజన వ్యాజ్యాలు దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై కర్ణాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అభయ్ శ్రీనివాస్ ఓకా, జస్టిస్ అరవింద్ కుమార్ ధర్మాసనం బుధవారం విచారించింది. “వ్యాక్సిన్లను ఆపడానికి ఈ పిటిషన్ వేయబడిన మాట వాస్తవం. అయితే, ఈ పిటిషన్ ప్రజా ప్రయోజనాల కోసం దాఖలు చేయబడలేదని సూచిస్తున్నది. అందువల్ల కోర్టు ఇతర విజ్ఞప్తులకు వెళ్లవలసిన వెళ్ళవలసిన అవసరం లేదు” అని కోర్టు అభిప్రాయపడింది.
మొదటి పిటిషనర్ ఆర్మీ ఆఫీసర్ అయినందున, 2, 3 వ పిటిషనర్లపై మాత్రమే ఖర్చులు విధించాలని హైకోర్టు ప్రతిపాదించింది. విలువైన కోర్టు సమయాన్ని వృథా చేసినందుకు వారికి రూ.50 వేల జరిమానా విధించింది. ఈ మొత్తాన్ని నెల రోజుల్లోపు సీఎం రిలీఫ్ ఫండ్‌కు జమచేయాలని ఇద్దరు పిటిషనర్లను ఆదేశించింది.
ఇవి కూడా చదవండి..
భారత్‌లో 130 రోజుల్లో 20 కోట్ల మందికి వ్యాక్సిన్
పాకిస్తాన్‌తో యుద్ధం వస్తే రాష్ట్రాలు సొంత ట్యాంకులు కొని పోరాడాలా? : కేజ్రీవాల్
మధ్యప్రదేశ్‌లో పీపీఈ కిట్ల కుంభకోణం..
ఇక ఎవరి ఆస్తికి నష్టం కలిగించినా భర్తీ చేయాల్సిందే..!
సముద్రంలో అరుదైన ఖనిజాలను కనుగొన్న జపాన్
7 ఏండ్లలో మోదీ 7 నిర్ణయాలు.. ప్రతి భారతీయుడిపై ప్రభావం
భారత ప్రధానిగా మోదీ ప్రమాణం.. చరిత్రలో ఈరోజు
అరటితో ఏమేం పోషకాలు అందుతాయంటే..?
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

