భారత ప్రధానిగా మోదీ ప్రమాణం.. చరిత్రలో ఈరోజు
భారతదేశం 15 వ ప్రధానమంత్రిగా నరేంద్ర దామోదరదాస్ మోదీ 2014 లో సరిగ్గా ఇదే రోజున ప్రమాణం చేశారు.

భారతదేశం 15 వ ప్రధానమంత్రిగా నరేంద్ర దామోదరదాస్ మోదీ 2014 లో సరిగ్గా ఇదే రోజున ప్రమాణం చేశారు. మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఒక కాంగ్రేసేతర పార్టీకి పూర్తి మెజార్టీ వచ్చి కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఇదే మొదటిసారి.
1984 సాధారణ ఎన్నికల్లో 404 సీట్లు గెలుచుకుని కాంగ్రెస్ తనకు తిరుగులేదని నిరూపించుకున్నది. ఈ ఎన్నికల్లో బీజేపీకి కేవలం రెండే సీట్లు వచ్చాయి. 30 ఏండ్ల తర్వాత జరిగిన జనరల్ ఎలక్షన్స్‌లో రెండు సీట్ల నుంచి బీజేపీ 282 సీట్లకు చేరుకున్నది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ 44 స్థానాలకు పడిపోయింది. మరికొన్ని పార్టీలు కూటమిగా బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది. తర్వాత ఎన్నికల్లో మరోసారి తమకు తామే సాటి అని నిరూపించుకుంటూ 303 సీట్లతో బీజేపీ విజయఢంకా మోగించి రెండోసారి కేంద్రంలో అధికారంలోకి వచ్చింది.
కేంద్రంలో బీజేపీ కూటమి అధికారంలోకి రావడానికి ముందు కాంగ్రెస్‌కు సవాళ్లు పెరిగాయి. లోక్‌పాల్ బిల్లు తేవాలంటూ అన్నా హజారే దీక్షలు కాంగ్రెస్‌కు ఇబ్బందికరంగా తయారైంది. మరోవైపు, బీజేపీపై ప్రజల్లో విశ్వాసం పెరుగుతూ వస్తున్నది. ప్రధాని పదవికి నరేంద్ర మోదీ పేరును బీజేపీ ప్రకటించింది. అయితే, కాంగ్రెస్ సహా ఇతర ప్రతిపక్ష పార్టీల్లో సరైన నాయకత్వం లేకపోవడం, ఐక్యత కొరవడం వంటి కారణాలతో నరేంద్ర మోదీ నేతృత్వంలో బీజేపీ భారీ మెజార్టీ సాధించి కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసి చరిత్ర సృష్టించింది.
మరికొన్ని ముఖ్య సంఘటనలు..
2014: ఉత్తరప్రదేశ్‌లోని చురేబ్ రైల్వే స్టేషన్లో గోరఖ్‌పూర్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదంలో 29 మంది ప్రయాణికులు మరణం
2010: సహజీవనం చేసే వారి పిల్లలకు తల్లిదండ్రుల ఆస్తిలో వాటా పొందే హక్కు ఉంటుందన్న సుప్రీంకోర్టు
2007: భారతదేశంజర్మనీల మధ్య కుదిరిన రక్షణ ఒప్పందం
2002: చైనా విమానం సముద్రంలో కూలి 225 మంది ప్రయాణికులు దుర్మరణం
1999 : మూడు శాటిలైట్లను ఒకేసారి రోదసీలోకి పంపి చరిత్ర సృష్టించిన ఇస్రో
1998: తొలిసారి జాతీయ క్షమాపణ దినోత్సవాన్ని జరుపుకున్న ఆస్ట్రేలియా
1950: పెట్రోల్ కొనుగోలు పరిమితిని రద్దు చేసిని బ్రిటన్
1926 : గర్వాల్లోని జిమ్ కార్బైడ్ పార్కులో మనుషులను తినేందుకు అలవాటు పడిన హతమార్చిన అటవీ అధికారులు
ఇవి కూడా చదవండి..
అరటితో ఏమేం పోషకాలు అందుతాయంటే..?
ఆఫ్ఘనిస్తాన్‌లో విస్తరిస్తున్న తాలిబాన్.. మూడు జిల్లాలు స్వాధీనం
మయన్మార్‌లో అంతర్యుద్ధానికి అవకాశాలు : యూఎన్ హెచ్చరిక
విరాట్ సేనకు వెటరన్ క్రికెటర్ రిచర్డ్ హాడ్లీ ప్రశంసలు
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

