భారత్‌లో 130 రోజుల్లో 20 కోట్ల మందికి వ్యాక్సిన్
భారతదేశంలో 130 రోజుల్లో 20 కోట్ల మందికి పైగా వ్యాక్సిన్ అందజేశారు. అమెరికా తర్వాత ఇంత పెద్ద మొత్తంలో వ్యాక్సిన్ ఇచ్చిన దేశంగా భారత్ నిలిచింది.

న్యూఢిల్లీ : భారతదేశంలో 130 రోజుల్లో 20 కోట్ల మందికి పైగా వ్యాక్సిన్ అందజేశారు. అమెరికా తర్వాత ఇంత పెద్ద మొత్తంలో వ్యాక్సిన్ ఇచ్చిన దేశంగా భారత్ నిలిచింది. అమెరికా 20 కోట్ల మందికి వ్యాక్సిన్ ఇవ్వడానికి 124 రోజుల సమయం పట్టింది.
60 ఏండ్ల వయసు పైబడిన జనాభాలో 42 శాతం మందికి మొదటి డోసు ఇచ్చినట్లు, కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలిపింది. దేశవ్యాప్తంగా థర్డ్ వేవ్ వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో రోగనిరోధకత పెంచుకోవడానికి ప్రచారం ప్రారంభించినప్పటి నుంచి 18-44 ఏండ్లలోపు మొత్తం 1.28 కోట్ల మందికి వ్యాక్సిన్ మొదటి మోతాదు ఇచ్చినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ మంగళవారం తెలిపింది. ఈ వయస్సు గల 9,42,796 మంది లబ్ధిదారులకు మంగళవారం మొదటి డోసు ఇచ్చారు. దేశంలో ఇప్పటివరకు మొత్తం 20 కోట్ల 4 లక్షల 94 వేల 991 మోతాదుల వ్యాక్సిన్లు ఇచ్చినట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. 97,94,835 మంది ఆరోగ్య కార్యకర్తలు ఫస్ట్ డోసు తీసుకోగా, 67,28,443 మంది ఆరోగ్య కార్యకర్తలు సెకండ్ డోసు తీసుకున్నారని వెల్లడించారు.
22 కోట్లకు పైగా వ్యాక్సిన్లు ఇచ్చారు..
1.77 కోట్లకు పైగా కొవిడ్ -19 వ్యాక్సిన్లు ఇప్పటికీ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో అందుబాటులో ఉన్నాయని మంత్రిత్వ శాఖ తెలిపింది. అలాగే, రాబోయే 3 రోజుల్లో రాష్ట్రాలకు లక్ష మోతాదులో టీకాలు వస్తాయని పేర్కొన్నది. కేంద్రం ఇప్పటివరకు 22,00,59,880 మోతాదుల వ్యాక్సిన్‌ను రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఉచిత క్యాటగిరీలో అందించినవే కాకుండా రాష్ట్రాలు నేరుగా కొనుగోలు చేశాయని మంత్రిత్వ శాఖ తెలిపింది.
ఇవి కూడా చదవండి..
పాకిస్తాన్‌తో యుద్ధం వస్తే రాష్ట్రాలు సొంత ట్యాంకులు కొని పోరాడాలా? : కేజ్రీవాల్
మధ్యప్రదేశ్‌లో పీపీఈ కిట్ల కుంభకోణం..
ఇక ఎవరి ఆస్తికి నష్టం కలిగించినా భర్తీ చేయాల్సిందే..!
సముద్రంలో అరుదైన ఖనిజాలను కనుగొన్న జపాన్
7 ఏండ్లలో మోదీ 7 నిర్ణయాలు.. ప్రతి భారతీయుడిపై ప్రభావం
భారత ప్రధానిగా మోదీ ప్రమాణం.. చరిత్రలో ఈరోజు
అరటితో ఏమేం పోషకాలు అందుతాయంటే..?
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Indian Roller | పాలపిట్టను విడుదల చేసిన ఘటనపై కేసు నమోదు
World Cup | ఇండియాలో వరల్డ్ కప్ టోర్నీకి పాకిస్తాన్ దూరం.. జట్టు పర్యటనకు అనుతివ్వని పీసీబీ
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Muskan Rastogi | బ్లూ డ్రమ్ మర్డర్ కేసు.. జైలులోనే నిందితురాలు, 10 నెలల కూతురు.. చిన్నారి దత్తత కోరుతూ పిటిషన్
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

