e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, June 20, 2021
Home News కొవిడ్ నివార‌ణ‌లో 'సెనోటైజ్' 99 శాతం ప్ర‌భావవంతం : గిల్లి రిగెవ్‌

కొవిడ్ నివార‌ణ‌లో ‘సెనోటైజ్’ 99 శాతం ప్ర‌భావవంతం : గిల్లి రిగెవ్‌

కొవిడ్ నివార‌ణ‌లో 'సెనోటైజ్' 99 శాతం ప్ర‌భావవంతం : గిల్లి రిగెవ్‌

న్యూఢిల్లీ : కొవిడ్ నివార‌ణ‌లో త‌మ కంపెనీ త‌యారు చేసిన ‘సెనోటైజ్’ నాస‌ల్ స్ప్రే 99 శాతం ప్ర‌భావ‌వంత‌మైన‌ద‌ని ‘సెనోటైజ్’ వ్య‌వ‌స్థాప‌కురాలు గిల్లి రెగెవ్ చెప్పారు. ఈ నాస‌ల్ స్ప్రే రావ‌డంతో ఇండియాలో క‌రోనా ఆట‌ల‌ను క‌ట్టేయ‌వ‌చ్చున‌న్నారు. త్వ‌ర‌లోనే భార‌తీయ మార్కెట్లో త‌మ మందు విస్తృతంగా ల‌భించేలా ప‌లు కంపెనీల‌తో చర్చ‌లు జ‌రుపుతున్న‌ట్లు ఆమె తెలిపారు.

కరోనా వైర‌స్‌ను నివారించేందుకు ఇప్పుడిప్పుడే ప‌లు ఔష‌ధాలు మార్కెట్లోకి వ‌స్తున్నాయి. కెన‌డాకు చెందిన ‘సెనోటైజ్ అనే ఔష‌ధ త‌యారీ సంస్థ ముక్కు ద్వారా వేసుకునే మందును క‌నిపెట్టింది. ఈ నాస‌ల్ స్ప్రే బ్రిట‌న్‌, న్యూజిలాండ్‌లో క్రినిక‌ల్ ట్ర‌య‌ల్స్ ప్ర‌క్రియ‌ను పూర్తిచేసుకున్న‌ద‌ని గిల్లి రెగెవ్ చెప్పారు. అధిక జనాభా ఉన్న భార‌త్ లాంటి దేశంలో ప్రతి ఒక్కరికి త్వరగా టీకాలు వేయడం చాలా ఇబ్బంది అని, దీనికి ప్ర‌త్యామ్నాయంగా నాస‌ల్ స్ప్రేను తీసుకువ‌స్తున్న‌ట్లు ఆమె పేర్కొన్నారు. త‌మ ఔష‌ధం 99 శాతం ప్రభావవంతంగా ఉన్న‌ద‌ని తెలిపారు. ల్యాబ్‌లో నాసల్‌ స్ప్రేని పరీక్షించిన తర్వాత దీని తయారీ సూత్రాన్ని అమెరికాలోని ఉటా స్టేట్ యూనివర్శిటీకి పంపించామ‌ని, అక్క‌డ‌ ప్రయోగశాల పరీక్షల అనంత‌రం 99 కాదు 99.9 శాతం ప్రభావవంతంగా ఉన్న‌ద‌ని యూనివ‌ర్శిటీ యాంటీ వైర‌ల్ ఇన్‌స్టిట్యూట్‌ తెలిపింద‌ని ఆమె చెప్పారు.

ఈ నాస‌ల్‌ స్ప్రే నైట్రిక్ ఆక్సైడ్‌తో తయారు చేయబడింద‌ని, ఈ రసాయనం మ‌న శ‌రీరంలోని ప్రతి వ్యవస్థలో ఇప్పటికే ఉంటున్నందున‌ దానితో సర్దుబాటు చేసుకోవ‌డంలో ఎటువంటి సమస్య ఉండద‌న్నారు. నైట్రిక్ ఆక్సైడ్ ఒక రసాయనం, ఇది బ్యాక్టీరియా, వైరస్‌ల‌ పెరుగుదలను యాంటీ ఎఫెక్టివ్ సూక్ష్మజీవిగా ఆపుతుందని తెలిపారు. ఇది ఏదైనా హ్యాండ్ శానిటైజర్ లాగానే పనిచేస్తుంద‌ని చెప్పారు. ఈ నైట్రిక్ ఆక్సైడ్ ముక్కులో ఉన్న గ్రాహకాల కణాలలోకి వైరస్ ప్రవేశించడాన్ని అడ్డుకుంటుందని వెల్ల‌డించారు.

త‌మ నాస‌ల్ స్ప్రేను ఉత్ప‌త్తి చేసేందుకు ప‌లువురు త‌మ‌తో సంప్ర‌దిస్తున్నార‌ని గిల్లి రెగెవ్ తెలిపారు. అయితే , కొన్ని ప్ర‌ముఖ సంస్థ‌ల‌తో చ‌ర్చ‌లు జ‌రుపుతున్నామ‌ని, త్వ‌ర‌లోనే మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు ప్లాన్ చేశామ‌న్నారు. ప్ర‌తి ఒక్క‌రికి అందుబాటులో ఉండేలా ధ‌ర‌ను నిర్ణ‌యిస్తామ‌ని ఆమె వెల్ల‌డించారు.

ఇవి కూడా చ‌ద‌వండి..

భార‌త తొలి ప్ర‌ధాని నెహ్రూ క‌న్నుమూత‌.. చ‌రిత్ర‌లో ఈరోజు

వ్యాక్సిన్ నిల‌పాలంటూ పిటిష‌న్‌.. పిటిష‌న్‌దారుకు 50 వేల జ‌రిమానా..

భార‌త్‌లో 130 రోజుల్లో 20 కోట్ల మందికి వ్యాక్సిన్‌

పాకిస్తాన్‌తో యుద్ధం వ‌స్తే రాష్ట్రాలు సొంత ట్యాంకులు కొని పోరాడాలా? : కేజ్రీవాల్

మ‌ధ్యప్ర‌దేశ్‌లో పీపీఈ కిట్ల కుంభ‌కోణం..

స‌ముద్రంలో అరుదైన ఖ‌నిజాల‌ను క‌నుగొన్న జపాన్‌

తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ , ట్విటర్‌టెలిగ్రామ్‌ ను ఫాలో అవండి..

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
కొవిడ్ నివార‌ణ‌లో 'సెనోటైజ్' 99 శాతం ప్ర‌భావవంతం : గిల్లి రిగెవ్‌

ట్రెండింగ్‌

Advertisement