Shadow Minister | మైనారిటీ శాఖలో షాడో మినిస్టర్ హల్చల్.. మంత్రి అజారుద్దీన్‌కు తెలియకుండానే సమీక్షలు
Shadow Minister | రాష్ట్ర మైనారిటీ శాఖలో షాడో మినిస్టర్ హల్చల్ చేస్తున్నారనే ప్రచారం రాజకీయ, అధికార వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. నామినేటెడ్ పోస్టులో ఉన్న ఓ నాయకుడు మైనారిటీ శాఖను తన గుప్పిట్లో పెట్టుకుని పెత్తనం చలాయిస్తున్నాడని జోరుగా ప్రచారం జరుగుతోంది.
Shadow Minister | రాష్ట్ర మైనారిటీ శాఖలో షాడో మినిస్టర్ హల్చల్ చేస్తున్నారనే ప్రచారం రాజకీయ, అధికార వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. నామినేటెడ్ పోస్టులో ఉన్న ఓ నాయకుడు మైనారిటీ శాఖను తన గుప్పిట్లో పెట్టుకుని పెత్తనం చలాయిస్తున్నాడని జోరుగా ప్రచారం జరుగుతోంది. మంత్రి అజారుద్దీన్‌కు తెలియకుండానే సమీక్షా సమావేశాలు సైతం నిర్వహిస్తున్నాడనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
జిల్లా స్థాయి నుంచి సెక్రటేరియట్ స్థాయి వరకు మైనారిటీ శాఖకు సంబంధించిన ఏ పనైనా తన అనుమతి లేకుండా జరగకూడదని అధికారులకు సదరు లీడర్ హుకుం జారీ చేసినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. అధికారులు లేదా స్థానిక నేతలు ఆయన్ను పక్కనబెట్టి నేరుగా ఉన్నత స్థాయి అధికారులను సంప్రదిస్తే.. స్వయంగా ఫోన్ చేసి క్లాస్ పీకుతాడని.. బదిలీ చేస్తానని బెదిరిస్తాడని కొందరు అధికారులు చెబుతున్నారు. దీంతో ఆయనతో వైరం పెట్టుకునే బదులు చేయి కలపడమే మేలు అనుకుని అతని ఇంటికి వెళ్లి మరీ పలువురు లీడర్లు, అధికారులు కలుస్తున్నారని చర్చ నడుస్తోంది.
ఇటీవల ఉత్తర తెలంగాణలోని ఓ ఉమ్మడి జిల్లాకు సంబంధించిన మైనారిటీ శాఖ సమీక్ష వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించగా.. మైనారిటీ శాఖ మంత్రి లేకుండానే సదరు షాడో మినిస్టర్‌నే సమీక్ష చేపట్టడం మరింత చర్చకు దారి తీసింది. దీంతో అజారుద్దీన్‌కు కేవలం పేరుకే మంత్రి పదవి ఇచ్చారా? ఆయన డమ్మీ మంత్రేనా అని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Delhi Police | రేపే సీజేపీ భారీ నిరసన.. అన్ని జాగ్రత్తలు తీసుకుంటామన్న ఢిల్లీ పోలీసులు
ACB Raid | ఏసీబీకి చిక్కిన విద్యుత్ ఏఈ..రూ.1.20 లక్షల లంచం తీసుకుంటూ పట్టివేత
‘దాసరి నెమలిపూర్ మీదుగా చెర్కుపల్లి వరకు బస్సు నడపాలి’
Satish Kumar | బీఆర్ఎస్ కార్యకర్తలకు అండగా ఉంటా : మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్
‘కోదాడ నియోజకవర్గంలోని మండలాలను కరువు మండలాలుగా ప్రకటించాలి’
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

