భారత తొలి ప్రధాని నెహ్రూ కన్నుమూత.. చరిత్రలో ఈరోజు
స్వతంత్ర భారత తొలి ప్రధానమంత్రి పండిత్ జవహర్లాల్ నెహ్రూ 1964 లో సరిగ్గా ఇదే రోజున పరమపదించారు.

స్వతంత్ర భారత తొలి ప్రధానమంత్రి పండిత్ జవహర్లాల్ నెహ్రూ 1964 లో సరిగ్గా ఇదే రోజున పరమపదించారు. మధ్యాహ్నం రెండు గంటల సమయంలో ఈ వార్త రేడియోలో ప్రసారం కావడంతో దేశం మొత్తం దుఖసాగరంలో మునిగిపోయింది. నెహ్రూ చనిపోయిన రెండు గంటల తర్వాత హోంమంత్రి గుల్జారీ లాల్ నందను తాత్కాలిక ప్రధానిగా చేశారు. అనంతరం సుదీర్ఘ కసరత్తు చేసిన నాలుగు రోజుల అనంతరం లాల్ బహదూర్ శాస్త్రిని కొత్త నాయకుడిగా ఎన్నుకోవడంతో తదుపరి ప్రధానిగా లాల్ బహదూర్ శాస్త్రి నియమితులయ్యారు.
నెహ్రూ 16 సంవత్సరాల 9 నెలల 12 రోజుల పాటు భారత ప్రధానిగా ఉన్నారు. ఇది ఇప్పటి వరకు రికార్డు. పదవిలో ఉన్న సమయంలో తన వారసుడి గురించి ఎటువంటి సూచన చేయలేదు. సరిగ్గా తన0 మరణానికి 5 రోజుల ముందు విలేకరుల సమావేశంలో ఆయనను ఇదే ప్రశ్న అడగ్గా.. నేను దాని గురించి ఆలోచించడం ప్రారంభించానని, కానీ నా మరణం ఇంత త్వరగా జరుగుతుందని అనుకోవడం లేదని సెలవిచ్చారు.
మరుసటి రోజు నాలుగు రోజుల పర్యటన నిమిత్తం డెహ్రాడూన్ కు బయలుదేరిన నెహ్రూ అక్కడ గుండెపోటుకు గురయ్యాడు. రెండు రోజులకు ఢిల్లీ చేరుకున్న తర్వాత నేరుగా తీవ్ర అస్వస్థతకు గురై తుదిశ్వాస విడిచారు.
మరికొనని ముఖ్య సంఘటనలు..
2006: ఇండోనేషియాలో భూకంపం, 5 వేల మందికి పైగా మృతి.
1994: అమెరికాలో 20 ఏండ్లు ప్రవాసంలో గడిపి రష్యాకు తిరిగొచ్చిన నవలా రచయిత అలెగ్జెండర్ సోల్జెనిట్సిన్
1941: రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో సముద్రంలో మునిగిపోయిన జర్మన్ నావికాదళ ఓడ బిస్మార్క్
1933: దఇ త్రీ లిటిల్ పిగ్స్ అనే యానిమేటెడ్ లఘు చిత్రాన్ని విడుదల చేసి వాల్ట్ డిస్నీ
1813: కెనడాలోని ఫోర్ట్ జార్జ్‌ను స్వాధీనం చేసుకున్న అమెరికా
1703: రష్యా సాంస్కృతిక రాజధానిగా సెయింట్ పీటర్స్బర్గ్కు పునాది వేసిన జార్ పీటర్
ఇవి కూడా చదవండి..
వ్యాక్సిన్ నిలపాలంటూ పిటిషన్.. పిటిషన్‌దారుకు 50 వేల జరిమానా..
భారత్‌లో 130 రోజుల్లో 20 కోట్ల మందికి వ్యాక్సిన్
పాకిస్తాన్‌తో యుద్ధం వస్తే రాష్ట్రాలు సొంత ట్యాంకులు కొని పోరాడాలా? : కేజ్రీవాల్
మధ్యప్రదేశ్‌లో పీపీఈ కిట్ల కుంభకోణం..
సముద్రంలో అరుదైన ఖనిజాలను కనుగొన్న జపాన్
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో వంశీకి కెప్టెన్సీ.. ఫ్యామిలీ కోసం ముకేశ్‌కు వర్షిణి త్యాగం, నరేష్‌పై అమన్, ఆర్కే ఆగ్రహం!
Inter Exams | ఫిబ్రవరి 24 నుంచి ఇంటర్ ఎగ్జామ్స్.. తొలిసారిగా ఫస్టియర్‌కు ప్రాక్టికల్స్
Munaganoor Land Scam | 200 కోట్ల భూమేతకు ‘బిగ్’ స్కెచ్.. రంగారెడ్డి జిల్లాలో సర్వే నంబర్లు మార్చి సర్కార్ భూమికి ఎసరు!
IPL 2028 | రూ.40 కోట్లు ఇస్తేనే మీ జట్టులో ఉంటాం.. ఐపీఎల్ ఫ్రాంచైజీలకు టాప్ ప్లేయర్ల షాక్!
అర్హులైన చెంచులందరికీ ఉపాధి కల్పిస్తాం: సీతక్క
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

