e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, June 19, 2021
Home News న‌టసార్వ‌భౌముడు పుట్టింది ఇవాళే.. చ‌రిత్ర‌లో ఈరోజు

న‌టసార్వ‌భౌముడు పుట్టింది ఇవాళే.. చ‌రిత్ర‌లో ఈరోజు

న‌టసార్వ‌భౌముడు పుట్టింది ఇవాళే.. చ‌రిత్ర‌లో ఈరోజు

ప్ర‌ముఖ సినీ న‌టుడు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు 1923 లో స‌రిగ్గా ఇదే రోజున జన్మించారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లా పామర్రు మండలం నిమ్మకూరు గ్రామంలో లక్ష్మయ్య, వెంకట రామమ్మ దంపతులకు జన్మించారు. విజ‌య‌వాడ మున్సిప‌ల్ స్కూల్‌లో పాఠ‌శాల విద్య పూర్తి చేసిన ఎన్టీఆర్‌.. కాలేజీ విద్య‌ను ఎస్ఆర్ఆర్ కాలేజీ నుంచి చ‌దివారు. 1942 మే నెలలో 20 ఏళ్ళ వయసులో మేనమామ కుమార్తె బసవ రామతారకాన్ని పెళ్ళి చేసుకున్నారు. తార‌క‌రామారావు, బ‌స‌వ‌తార‌కం దంప‌తుల‌కు 11 మంది సంతానం.

గుంటూరు ఆంధ్రా క్రిస్టియన్ కళాశాలలో చేరిన ఎన్టీఆర్‌.. అక్కడ కూడా నాటక సంఘాల కార్యకలాపాలలో చురుకుగా పాల్గొనేవారు. ఆ సమయంలోనే నేషనల్ ఆర్ట్ థియేటర్ గ్రూప్ నాటక సంస్థను స్థాపించి కొంగర జగ్గయ్య, ముక్కామల, నాగభూషణం, కేవీఎస్ శర్మ తదితరులతో చేసిన పాపం వంటి ఎన్నో నాటకాలు ప్ర‌ద‌ర్శించారు. 1947 లో ప‌ట్ట‌భ‌ద్రుడైన త‌ర్వాత స‌ర్వీస్ క‌మిష‌న్ ప‌రీక్ష రాసి మంగ‌ళ‌గిరిలో స‌బ్ రిజిస్ట్రార్ ఉద్యోగానికి ఎంపిక‌య్యారు. అయితే, సినిమాల్లో చేరాల‌నే కోరిక కార‌ణంగా మూడు వారాల్లోనే ఉద్యోగానికి రాజీనామా చేసి చెన్న‌ప‌ట్నంకు వెళ్లాడు. ఎన్టీఆర్ న‌టించిన తొలి సినిమా మ‌న దేశం 1949 లో విడుద‌లైంది. 1951 లో పాతాళ‌భైర‌వి, 1952 లో మ‌ళ్లీశ్వ‌రి సినిమాల‌తో ఆయ‌న వెన‌క్కి చూసుకోవాల్సిన అవ‌స‌రం లేకుండా గొప్ప న‌టుడిగా త‌యార‌య్యారు. రాముడు, కృష్ణుడు, దుర్యోధనుడు, రావణాసురుడు, భీముడు, కర్ణుడు ఇలా ఎన్నో పౌరాణిక పాత్రలతో తెలుగు వారి హృదయాలలో శాశ్వతంగా, ఆరాధ్య దైవంగా నిలిచిపోయారు. ఎన్నో వైవిధ్య పాత్ర‌ల‌ను పోషించిన ఆయ‌న న‌ట‌సార‌భౌముడిగా తెలుగు సినీ చ‌రిత్ర‌లో ఆయ‌న పేరు లిఖించికున్నారు.

ఎన్టీఆర్ ను భగవత్స్వరూపంగా భావించే ఆయన అభిమానులను అలరించడానికి ఆయన 17 సినిమాలలో శ్రీ కృష్ణుడి వేషం కట్టారు. దేవాలయాలలో పూజారి వృత్తికి మొదటిసారి బ్రాహ్మణేతరులకు కూడా అవకాశం వచ్చేలా పరీక్ష ద్వారా పదవులను భర్తీ చేయించిన ఘనత ఎన్టీఆర్‌దే. తెలుగుదేశం పార్టీని స్థాపించి కేవ‌లం 90 రోజుల వ్య‌వ‌ధిలో 35 వేల కిలోమీట‌ర్ల మేర‌ ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర‌మంతా ప‌ర్య‌టించి 9 నెల‌ల‌ స‌మ‌యంలోనే త‌న పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు. అనంత‌రం ఎన్నో నిర్ణ‌యాలు తీసుకుని తెలుగు ప్ర‌జ‌ల మ‌దిలో చిర‌స్థాయిగా నిలిచిపోయారు. జాతీయ రాజ‌కీయాల్లోనూ త‌నదైన ముద్ర‌ను వేసిన ఎన్టీఆర్‌.. ఎన్డీఏకు జీవం పోసి తొలి కాంగ్రెసేత‌ర ప్ర‌భుత్వం ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు.

మ‌రికొన్ని ముఖ్య సంఘ‌ట‌న‌లు..

నేడు వీర‌సావ‌ర్క‌ర్ 138 వ జ‌యంతి

2011: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును ఓడించి ఐపీఎల్ క‌ప్ గెలుచుకున్న‌ చెన్నై సూపర్ కింగ్స్

2008: 13 సంవత్సరాల అంతర్యుద్ధం తర్వాత నేపాల్‌లో ముగిసిన‌ 240 సంవత్సరాల రాచరికం

1998: 5 అణు పరీక్షలను నిర్వహించిన పాకిస్తాన్‌

1959: అంత‌రిక్షంలోకి విజ‌య‌వంతంగా ప్ర‌యాణ‌మైన రెండు అమెరికన్ కోతులు

1965: ధన్‌బాద్‌లోని గనిలో పేలుడు, 375 మంది దుర్మ‌ర‌ణం

1963: బెంగాల్ బేలో తుఫాను కారణంగా దాదాపు 22 వేల మంది మరణం

1961 : ఆమ్నెస్టీ ఇంట‌ర్నేష‌న‌ల్ ప్రారంభం

1937 : వోక్స్ వాగ‌న్ కార్ల త‌యారీ కంపెనీ ప్రారంభం

1908: డిటెక్టివ్ నవల జేమ్స్ బాండ్ రచయిత ఇయాన్ ఫ్లెమింగ్ జన‌నం

ఇవి కూడా చ‌ద‌వండి..

కొవిడ్ పాజిటివ్ శిశువుకు జ‌న్మ‌నిచ్చిన నెగెటివ్ త‌ల్లి

218 కోట్ల ఫండ్ అందుకున్న కూ యాప్‌

జూలై 5 న‌ అమెజాన్ సీఈఓ ప‌ద‌వికి గుడ్‌బై చెప్ప‌నున్న‌ జెఫ్ బెజోస్

భార‌త్‌లో యాంటీబాడీ కాక్టెయిల్‌తో చికిత్స .. కరోనా నుంచి కోలుకున్న హర్యానా వాసి

తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ , ట్విటర్‌టెలిగ్రామ్‌ ను ఫాలో అవండి..

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
న‌టసార్వ‌భౌముడు పుట్టింది ఇవాళే.. చ‌రిత్ర‌లో ఈరోజు

ట్రెండింగ్‌

Advertisement