Tungabhadra : కర్నూలు జిల్లా మంత్రాలయం వద్ద తుంగభద్ర నదిలో ఈతకు వెళ్లి ఐదుగురు గల్లంతయ్యారు. హైదరాబాద్కి చెందిన యువన్ చంద్ర(5), సతీష్ (35), మంత్రాలయం నివాసులు రాఘవేంద్ర (25), ధను(23) , ఉరవకొండకి చెందిన సంధ్య (22) ఐదు మంది నీళ్లలో మునిగిపోయారు. వీరికోసం మత్య్సకారులతో కలిసి పోలీసులు గాలిస్తున్నారు.
మంత్రాలయంలోని బంధువుల ఇంట్లో జరిగిన సత్యనారాయణ స్వామి పూజకు హైదరాబాద్కు చెందిన యువన్ చంద్ర(5), సతీష్ (35), మంత్రాలయం నివాసులు రాఘవేంద్ర (25), ధను(23), ఉరవకొండకి చెందిన సంధ్య (22)లు హాజరయ్యారు. అనంతరం సమీపంలోని తుంగభద్ర నదిలో ఈత కొట్టేందుకు ఈ ఐదుగురు వెళ్లారు.
నీటి లోతు ఎంత ఉందో అంచనా వెయ్యేలేక పోవడంతో వీరంతా గల్లంతయ్యారు. ఈ ఘటనలో ఆదోని చెందిన అపర్ణ సురక్షితంగా బయటపడింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటానా స్థలానికి చేరుకున్నారు. మత్స్యకారుల సాయంతో గల్లంతైన యువన్ చంద్ర, సతీష్, రాఘవేంద్ర, ధను, సంధ్యల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.