IBPS Clerk | 11,403 క్లర్క్ ఉద్యోగాలు
IBPS Clerk | బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేసేవారికి సువర్ణాకాశం వచ్చింది. వేల క్లర్క్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన విడుదలైంది. ఈ సువర్ణావకాశాన్ని అర్హులైనవారు సద్వినియోగం చేసుకోవాలి.
IBPS Clerk | ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఖాళీగా ఉన్న 11,403 క్లర్క్ పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్‌ను ‘ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS) విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా దేశంలోని 11 ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఈ ఖాళీలను 2027-28 సంవత్సరానికి భర్తీ చేస్తారు. దీనిలో తెలంగాణలో 191, ఆంధ్రప్రదేశ్‌లో 186 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
అర్హతలు
ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ ఉత్తీర్ణులైనవారు అర్హులు. ఈ ఏడాది ఆగస్టు 1 నాటికి అభ్యర్థుల వయస్సు 20 నుంచి 28 ఏండ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు 5, ఓబీసీలకు 3, దివ్యాంగులకు 10 ఏండ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. అభ్యర్థులు ఏదైనా ఒక రాష్ట్రం లేదా కేంద్ర పాలి ప్రాంతానికి మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. వీరు ఆయా ప్రాంతపు స్థానిక భాషలో ప్రావీణ్యం కలిగి ఉండాలి. దీంతో పాటు కంప్యూర్ పరిజ్ఞానం ఉండాలి. భారత్‌లో శాశ్వతంగా స్థిరపడాలని పాకిస్తాన్, బర్మా, శ్రీలంక, కెన్యా, ఉగాండా, టాంజానియా, జాంబియా, మలావి, రిపబ్లిక్ ఆఫ్ కాంగో, ఇథియోపియా, వియత్నాంల నుంచి వలస వచ్చిన భారతీయ సంతతికి చెందిన వ్యక్తులు కూడా అర్హులు.
ఫీజు
జనరల్ అభ్యర్థులకు రూ. 850, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు రూ. 175. ఫీజు ఇంటర్నెట్ బ్యాంకింగ్, డెబిట్/క్రెడిట్ కార్డ్, భీమ్ యూపీఐ, మాస్టర్‌కార్డ్ ద్వారా చెల్లించవచ్చు. ఈ ఫీజు రిఫండ్ చేయరు.
ఎంపిక
కస్టమర్ సర్వీస్ అసోసియేట్, క్లరికల్ కేడర్ పోస్టులకు ప్రిలిమినరీ, మెయిన్స్, లోకల్ లాంగ్వేజ్ టెస్ట్‌ల ద్వారా ఎంపిక చేస్తారు. ఆన్లైన్లో చేసుకునే దరఖాస్తులకు చివరితేదీ ఆగస్టు 21. ఇతర వివరాలకు వెబ్సైట్ www.ibps.inలో చూడవచ్చు.
Read Today's Latest Notifications News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

