KTR | ఏ యాక్టర్ల ఫోన్లు ట్యాప్ కాలేదన్నారు.. ఫేక్ న్యూస్‌పై కేటీఆర్
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ప్రగతి భవన్లో కేసీఆర్ క్యాంప్ ఆఫీస్ పెడితే 150 బెడ్రూమ్లున్నాయని ప్రచారం చేశారు.. మరి ఇప్పుడక్కడ ఎవరుంటున్నారు..? ఉన్నాయా 150 బెడ్రూమ్లు. అందులో బంగారు కప్బోర్డులున్నాయన్నారు. ఆ ఫేక్ న్యూస్ వ్యాపింపచేసింది ఎవరు..? ఇవన్నీ కూడా ఖచ్చితంగా ప్రశ్నించాలన్నారు.
KTR | సోషల్ మీడియా ద్వారా ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తున్నారని మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. మీడియాలో, సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ వస్తే అవును తప్పకుండా (ఫ్యాక్ట్ చెక్) నిజాలను నిర్దారించుకోవాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. నవతెలంగాణ దినపత్రిక 11వ వార్షికోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లో బాగ్ లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహిస్తున్న సెమినార్లో ‘రాజ్యాంగం–ప్రజాస్వామ్యం–పత్రికా స్వేచ్ఛ’ అంశంపై కేటీఆర్ ప్రసంగించారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ప్రగతి భవన్లో కేసీఆర్ క్యాంప్ ఆఫీస్ పెడితే 150 బెడ్రూమ్లున్నాయని ప్రచారం చేశారు..మరి ఇప్పుడక్కడ ఎవరుంటున్నారు..? ఉన్నాయా 150 బెడ్రూమ్లు. అందులో బంగారు కప్బోర్డులున్నాయన్నారు. ఆ ఫేక్ న్యూస్ వ్యాపింపచేసింది ఎవరు..? రూ.84 వేల కోట్ల ఖర్చయిన కాళేశ్వరం ప్రాజెక్టును రూ.లక్ష కోట్ల కుంభకోణమని ప్రచారం చేశారు. అది ఫేక్ న్యూస్ కాదా..? ఇవన్నీ కూడా ఖచ్చితంగా ప్రశ్నించాలన్నారు.
ఫోన్ ట్యాపింగ్‌లో ఎవరో సినిమా యాక్టర్ల ఫోన్లు మీడియాను అడ్డం పెట్టుకుని ట్యాప్ చేశామని ప్రచారం చేశారు.. ఫోన్ ట్యాపింగ్‌లో నన్ను విచారణకు పిలిస్తే పోయాను. ఏ యాక్టర్ల ఫోన్లు ట్యాప్ అయ్యాయి.. చెప్పు స్వామి కొద్దిగా నంబర్లు ఇయ్యమని అడిగా. ఎవరివీ కాలేదు సార్ అన్నడు. మరి ఎవరివీ కాకపోతే మీడియాకు చెప్పొచ్చు కదా ఇదేంది సోది అంటే.. చెప్పాను సార్ అని ఆ ఏసీపీ అన్నారు. ఎవరికి చెప్పారంటే ఆ పత్రికకు మాత్రం చెప్పానన్నారు.
ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత మేం కూడా బాధితులమే.. అధికారంలో ఉన్నవాళ్లు మాత్రమే కాదని కేటీఆర్ పేర్కొన్నారు. నిజం గడప దాటేలోపే అబద్ధం అంగీ లాగేసుకుని ఊరంతా తిరిగి వచ్చేస్తుంది, ఇది వాస్తవం. అందరం బాధితులమే. ఇందులో కాదనడానికి ఏం లేదు. వాస్తవాలు వాస్తవాలే కదా.. జరుగనివి జరిగినట్టుగా ఉన్నవి లేనట్టుగా లేనివి ఉన్నట్టుగా చూపిస్తున్నారన్నారు.
సోషల్ మీడియా ద్వారా ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తున్నారని మహేష్ కుమార్ గౌడ్ అన్నారు
ప్రగతి భవన్లో 150 బెడ్రూమ్లు, బంగారు కప్‌బోర్డులు ఉన్నాయని ఫేక్ న్యూస్ ప్రచారం చేసింది మీరే కదా?
రూ.84 వేల కోట్ల ఖర్చయిన కాళేశ్వరం ప్రాజెక్టును రూ.లక్ష కోట్ల కుంభకోణమని ప్రచారం చేశారు. అది ఫేక్… pic.twitter.com/16al7XUGcj
— Telugu Scribe (@TeluguScribe) August 1, 2026
Read Also :
Watch: పెళ్లి కోసం ఒత్తిడి చేసిన ప్రియురాలు.. బైక్‌తో ఈడ్చుకెళ్లిన వ్యక్తి
Watch: రైతుల నిరసన సందర్భంగా.. ధైర్యంగా బస్సు ముందు నిల్చొన్న మహిళా పోలీస్
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ranabaali | రణబాలి ట్విట్టర్ రివ్యూ.. విజయ్ దేవరకొండ నటనకు ప్రశంసలు, కథనంపై మిశ్రమ స్పందన!
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలిని, రోహిత్ మధ్య బ్రేకప్ వార్.. టాస్క్‌లో ఓటమితో వంశీ కన్నీళ్లు!
Caller ID | కాలర్ పేరు ప్రదర్శించడం తప్పనిసరి.. టెలికం కంపెనీలకు కేంద్రం ఆదేశం
Paper Leak | 8 ఏండ్లుగా పేపర్ లీక్‌లే లేవట.. NTAపై కేంద్ర విద్యా శాఖ నివేదిక
Reservations | మతం మారితే రిజర్వేషన్ వర్తించదు.. సుప్రీంకోర్టు కీలక తీర్పు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

