బండ్లగూడ,సెప్టెంబర్ 24: గంజాయి కేసులో తమను పోలీసులకు పట్టించాడని స్నేహితుడిని హత్య చేశారు. ఈ ఘటన రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ వెంకటేశ్ తెలిపిన వివరాల ప్ర కారం..నషీరుద్దీన్(26), షో హెబ్,ఇలియాస్‌లు కలిసి ఉప్పర్‌పల్లిలోని హ్యాపిహోమ్స్లో నివాసముంటున్నారు.వీరందరూ గంజాయి కేసులో నిందితులు.
కాగా ఇటీవల టాస్క్‌ఫోర్స్ పోలీసులు గంజాయి కేసులో షోహెబ్,ఇలియాస్‌లను అరెస్ట్ చేశారు. తమ గురించి పోలీసులకు నషీరుద్దీన్ సమాచారం ఇచ్చాడన్న అక్కసుతో గురువారం సాయంత్రం హ్యాపిహోమ్స్ టవర్ నంబర్ 5 వద్ద నషీరుద్దీన్ను హత్య చేశారు. మృత దేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నారు.