e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, June 13, 2021
Home News ఇమ్యూనిటీ కోసం జింక్ ల‌భించే 5 ఆహారాలు..

ఇమ్యూనిటీ కోసం జింక్ ల‌భించే 5 ఆహారాలు..

ఇమ్యూనిటీ కోసం జింక్ ల‌భించే 5 ఆహారాలు..

ప్ర‌స్తుత క‌ర‌నా కాలంలో సీ విట‌మిన్ ఎంత ముఖ్య‌మో.. జింక్ కూడా అంతే ముఖ్యం. జింక్ మ‌న శ‌రీరంలో వ్యాధి నిరోధ‌క‌త‌ను పెంపొందించడంలో గ్రేట్‌గా ప‌నిచేస్తుంది. మందులు లేకుండా రోగ‌నిరోధ‌క శ‌క్తిని పెంచుకోవాలంటే సీ విట‌మిన్ ఉండే ఆహారాల‌తోపాటు జింక్ ల‌భించే ఆహార‌ప‌దార్థాల‌ను నిత్యం తీసుకోవ‌డం అల‌వాటు చేసుకోవాలి. మ‌న శ‌రీరంలోకి ప్ర‌వేశించే వైర‌స్‌ల‌ను అడ్డుకోవ‌డంలో జింక్ పాత్ర అమోఘ‌మైన‌దిగా చెప్పుకోవ‌చ్చు.

జింక్ పొందేందుకు జింక్ టాబ్లెట్లు తీసుకుంటుంటాం. ఈ టాబ్లెట్ల వల్ల ఉప‌యోగాలేమోగానీ సైడ్ ఎఫెక్టులు మాత్రం ఉంటాయి. వీటికి బదులుగా జింక్ ఉండే ఆహారం తినడం వల్ల మంచి ప్రయోజనం పొంద‌వ‌చ్చంటున్నారు పోష‌కాహార నిపుణులు. జిక్.. చర్మం, పాంక్రియాస్, లివర్, కిడ్నీలకు ఎంతో మేలు చేస్తుంది. రోజూ మగవారికి 11 మిల్లీగ్రాములు, ఆడవారికి 8 మిల్లీగ్రాముల జింక్ అవసరం ఉంటుంది.

స‌జ్జ‌లు..

ఇమ్యూనిటీ కోసం జింక్ ల‌భించే 5 ఆహారాలు..

స‌జ్జ‌ల‌ను ఆహారంలో అనేక విధాలుగా ఉపయోగించుకోవ‌చ్చు. సరసమైన ధ‌ర‌తో అధిక పోషకాలు పొంద‌వ‌చ్చు. వీటిలో ప్రోటీన్, ఫైబర్, ఇతర ముఖ్యమైన విటమిన్లు, ఖనిజాలు ఉంటాయి. వీటిలో జింక్ ఉండి మ‌న ఆరోగ్యాన్ని కాపాడుతుంది. 100 గ్రాముల సజ్జలలో 3 మి.ల్లీ గ్రాముల ఐరన్ ఉంటుంది. ఊబ‌కాయం స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్న‌వారు తీసుకుంటే త్వ‌రగా ఫ‌లితం పొంద‌వ‌చ్చు. ఎముక‌ల‌ను దృఢంగా ఉంచుతుంది. జీర్ణకోశాన్ని ఆరోగ్యంగా త‌యారుచేస్తుంది.

నువ్వులు..

ఇమ్యూనిటీ కోసం జింక్ ల‌భించే 5 ఆహారాలు..

నువ్వుల‌ను వంటల్లోనే కాకుండా మాములుగా నువ్వుల ఉండలు, నువ్వుల పోడి ఇలా వివిధ‌ రకాలుగా ఉపయోగిస్తుంటాం. నువ్వులు జింక్, కాల్షియం, సెలీనియం, ఐరన్, విటమిన్ బీ 6 తో పాటు పోషకాల శక్తి కేంద్రం. ఇవి వేడిని ప్రేరేపిస్తాయి. అందుక‌ని నిత్యం రెండు స్పూన్ల‌కు మించ‌కుండా తీసుకోవ‌డం మంచిదే. నువ్వులను రాత్రిపూట నీటిలో నానబెట్టి అల్పాహారంగా కూడా తీసుకోవడం వ‌ల్ల మంచి ఫ‌లితం పొంద‌వ‌చ్చు.

పన్నీర్..

ఇమ్యూనిటీ కోసం జింక్ ల‌భించే 5 ఆహారాలు..

శాఖాహారుల మాంసాహారంగా ప్రసిద్ధి గాంచిన పనీర్ రుచికరంగా ఉండటమే కాకుండా శరీరానికి తగిన పోషకాలను అందిస్తుంది. పన్నీర్ కాల్షియం, జింక్, ఫాస్ప‌ర‌స్‌ ల‌ను క‌లిగి ఉంటుంది. వీటిలో ఒమేగా-3, ఒమేగా-6 ఫ్యాటీఆమ్లాలు ల‌భిస్తాయి. వీటిని తిన‌డం వ‌ల‌న ఎముక‌లు, దంతాల స‌మ‌స్య‌లు రావు. దీన్ని కూరలు, శాండ్‌విచ్‌లు, సలాడ్‌ల‌లో చేర్చుకోవచ్చు. మ‌హిళ‌ల‌కు మెనోపాజ్ స‌మ‌యంలో చిరాకుల‌ను దూరం చేస్తుంది.

శ‌న‌గ‌ప‌ప్పులు..

ఇమ్యూనిటీ కోసం జింక్ ల‌భించే 5 ఆహారాలు..

శనగల్లో జింక్‌తోపాటూ… ఐరన్, సోడియం, సెలెనియం, మాంగనీస్, రాగి ఉంటాయి. ఓ కప్పు ఉడికించిన శనగల్లో ఫైబర్, ప్రోటన్, 2.5 మిల్లీగ్రాముల జింక్ ఉంటుంది. జింక్ కావాలి అనుకునేవారు శనగలు, శ‌న‌గ ప‌ప్పులు తప్పక తీసుకోవాలి. రోగ నిరోధ‌క వ్య‌వ‌స్థ బాగా ప‌నిచేయ‌డానికి శెన‌గ‌ప‌ప్పు ఎంతో ఉప‌యోగ‌ప‌డుతుంది.

అమ‌ర్‌నాథ్ రాజ్‌గిరా..

ఇమ్యూనిటీ కోసం జింక్ ల‌భించే 5 ఆహారాలు..

అమర్‌నాథ్ రాజ్‌గిరా అనేది పురాతన కాలం నుంచి వాడుతున్న పోషకాహారం. ఇవి చిన్న సైజులో ఉండే గింజలు ప్రోటీన్స్‌తో నిండివుంటాయి. వీటిని వేపుకొని పాప్‌కార్న్‌లా, ఉడకబెట్టి రకరకాలుగా తినవచ్చు. ఇతర ఆహారాలతో కలిపి కూడా తినవచ్చు. ప్రోటీన్స్‌తోపాటూ వీటిలో ఫైబర్, విటమిన్స్, మిరల్స్ కూడా ఎక్కువే ఉంటాయి. విటమిన్లు ఏ, సీ, ఈ, కే, బీ5, బీ6, ఫొలేట్, నియాసిన్, రైబోఫ్లావిన్ ఉంటాయి. ఇవన్నీ మన బాడీలోని విష వ్యర్థాలను తరిమికొడతాయి. వ్యాధి నిరోధక శక్తి పెరగాలంటే అమర్‌నాథ్ గింజలు తినాలి.

వీటితోపాటు జ‌న‌ప‌నార విత్త‌నాలు, ఓట్స్‌, గుమ్మ‌డిగింజ‌లు, బీన్స్‌, జీడిప‌ప్పులో కూడా జింక్ పుష్క‌లంగా ల‌భిస్తుంది.

ఇవి కూడా చ‌ద‌వండి..

భార‌త్‌లో 5 జీ ట్రయల్స్‌కు మార్గం సుగ‌మం

మ‌హిళ‌ల ఆరోగ్యానికి సూప‌ర్ ఫుడ్స్‌..!

రా, ఐబీ చీఫ్ ప‌ద‌వీకాలం పొడ‌గింపు

‘వీర్ సావర్కర్’ సినిమాను ప్ర‌క‌టించిన సందీప్‌, అమిత్ వాద్వానీ

న‌టసార్వ‌భౌముడు పుట్టింది ఇవాళే.. చ‌రిత్ర‌లో ఈరోజు

కొవిడ్ పాజిటివ్ శిశువుకు జ‌న్మ‌నిచ్చిన నెగెటివ్ త‌ల్లి

జూలై 5 న‌ అమెజాన్ సీఈఓ ప‌ద‌వికి గుడ్‌బై చెప్ప‌నున్న‌ జెఫ్ బెజోస్

తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ , ట్విటర్‌టెలిగ్రామ్‌ ను ఫాలో అవండి..

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
ఇమ్యూనిటీ కోసం జింక్ ల‌భించే 5 ఆహారాలు..

ట్రెండింగ్‌

Advertisement