Yusuf Pathan | లోక్‌సభ ఎన్నికల బరిలో యూసుఫ్ పఠాన్.. మాజీ ఆల్ రౌండర్‌కు ఎన్ని కోట్ల ఆస్తులున్నాయో తెలుసా?
Yusuf Pathan | ప్రస్తుతం దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల సందడి నెలకొన్నది. ఈ నెల 19 నుంచి జూన్ ఒకటి వరకు ఏడు దశల్లో జరుగనున్నాయి. ఇప్పటికే తొలి దశ ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఈ నెల 26న రెండో విడుత ఎన్నికల జరుగనున్నది.
Yusuf Pathan | ప్రస్తుతం దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల సందడి నెలకొన్నది. ఈ నెల 19 నుంచి జూన్ ఒకటి వరకు ఏడు దశల్లో జరుగనున్నాయి. ఇప్పటికే తొలి దశ ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఈ నెల 26న రెండో విడుత ఎన్నికల జరుగనున్నది. ఇదిలా ఉండగా.. మిగతా దశ ఎన్నికల కోసం నామినేషన్ల స్వీకరణ కొనసాగుతున్నది. అభ్యర్థులు తమ నామపత్రాలను ఎన్నికల అధికారులకు అందజేస్తున్నారు. పశ్చిమ బెంగాల్ బర్హంపూర్ పార్లమెంటట్ స్థానం నుంచి మాజీ క్రికెటర్ యూసుఫ్ పఠాన్ బరిలోకి దిగుతున్నారు. పఠాన్ పోటీలో నిలువడంతో ఇక్కడ పోరు రసవత్తరంగా మారింది. మాజీ ఆల్ రౌండర్ తొలిసారిగా రాజకీయ రంగ ప్రవేశం చేస్తూ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు.
తాజాగా యూసఫ్ పఠాన్ సైతం నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ పత్రాల్లో ఆస్తులకు సంబంధించి కీలక విషయాలు వెల్లడించారు. ఎన్నికల అధికారులకు సమర్పించిన అఫిడవిట్లో ఆస్తులు రూ.45.63కోట్లుగా వెల్లడించారు. 2018-19లో మాజీ క్రికెటర్ మొత్తం సంపాదన రూ.3.10 కోట్లు అని.. 2019-20లో రూ.2.06 కోట్లుగా, 2020-21లో యూసుఫ్ పఠాన్ రూ.1.02కోట్లు, 2021-22లో రూ.64.18లక్షల ఆదాయం వచ్చినట్లు తెలిపారు. 2022-23లో రూ.2.92 కోట్లకు పేర్కొన్నారు. తన వద్ద నగదు రూ.1.41లక్షలు ఉందని.. భార్య అఫ్రీన్ పఠాన్ వద్ద రూ.15,678 నగదు ఉందని తెలిపారు. యూసుఫ్ పఠాన్ ఏడు బ్యాంకు ఖాతాల్లో రూ.2.46 కోట్లు డిపాజిట్ల రూపంలో ఉన్నాయని చెప్పారు.
రూ.26.34 లక్షల మ్యూచువల్ ఫండ్స్.. రూ.6.19కోట్ల విలువైన ఈక్విటీ షేర్లు ఉన్నట్లుగా వెల్లడించారు. కుటుంబీకులు, స్నేహితులకు రూ.1.68కోట్లు ఇచ్చినట్లుగా అఫిడవిట్లో ప్రకటించారు. తన వద్ద రెండు కార్లు ఉన్నాయని తెలిపారు. ఒకటి రూ.10.10లక్షల విలువైన హ్యుందాయ్.. మరొకటి టొయోటా ఫార్చ్యూనర్ రూ.35.30లక్షల విలువ ఉంటుందని తెలిపారు. యూసుఫ్ రూ.21.05లక్షల విలువైన వజ్రాభరణాలు ఉన్నాయని తెలిపారు. రూ.1.85కోట్ల విలువైన బంగారు, వెండి ఆభరణాలు ఉన్నట్లు పేర్కొన్నారు. మాజీ ఆల్ రౌండర్ తన అఫిడవిట్లో రూ.24.06 కోట్ల విలువైన చరాస్తుల ఉన్నట్లు వివరించారు. వడోదరలోని సాధి గ్రామంలో వ్యవసాయ భూములు, పాట్లు ఉన్నాయని తెలిపారు. వడోదర జిల్లాలోని అల్కాపురిలో వాణిజ్య భవనంలో వాటా ఉందని తెలిపారు. ప్రస్తుతం ఈ భవనం విలువ రూ.1.60కోట్లుగా పేర్కొంటున్నారు. దీపావళిపురాలో 11,026 చదరపు అడుగుల విస్తీర్ణంలో దుకాణం ఉందని.. దాని విలువ మార్కెట్లో రూ.10.50కోట్లుగా ఉందని తెలిపారు.
వడోదరలోని తండల్జా ప్రాంతంలోని నివాస గృహంలో పఠాన్‌కు నాలుగో వంతు వాటా ఉంది. 25167 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ ఇంటి ప్రస్తుత మార్కెట్ ధర రూ.7.50 కోట్లుగా పేర్కొన్నారు. దాంతో పాటు యూసుఫ్ పఠాన్‌కు యూఏఈలో ఓ విల్లా సైతం ఉంది. ఈ విల్లా ప్రస్తుత మార్కెట్ ధర రూ.1.65 కోట్లుగా పతెలిపారు. యూసుఫ్ పఠాన్ తన అఫిడవిట్లో మొత్తం రూ.21,56,35,350 విలువైన ఆస్తులు ఉన్నాయని.. స్థిరచరాస్తులు కలిపితే రూ.45.63కోట్లుగా ఉన్నట్లు వివరించారు. యూసుఫ్ తన అఫిడవిట్లో రూ.11.96కోట్ల అప్పులు ఉన్నట్లుగా వెల్లడించారు. తనకు వృత్తిపరంగా, అద్దెలు, వడ్డీ, మూలధనంతో లాభాలు, డివిడెండ్ ఆదాయం, క్రికెట్ అకాడమీ డైరెక్టర్‌గా వేతనం, అరిస్ అసోసియేట్స్‌లో పార్టనర్షిప్ తదితర మార్గాల ద్వారా ఆదాయం వస్తున్నట్లు వివరించారు. యూసుఫ్ అఫిడవిట్లో 11వ తరగతి ఉత్తీర్ణ సాధించానని.. వడోదరలోని నాగర్వాడ ఎంఈఎస్ హైస్కూల్లో విద్యాభ్యాసం చేసినట్ల తెలిపారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Donald Trump: బ్యాలెట్‌పై నేను లేను.. లేదంటే గెలిచేవాళ్లం: డోనాల్డ్ ట్రంప్
Tabu | నాగార్జున ‘కింగ్ 100’లో టబు పవర్ఫుల్ పాత్ర.. ఈసారి ప్రేమ కాదు, ఇద్దరి మధ్య భీకర పోరు!
NASA Astronauts: భూమికి 400 కిలోమీటర్ల ఎత్తులో .. ఓటేసిన నాసా ఆస్ట్రోనాట్లు.. వీడియో
ధాన్యం అమ్ముకునేందుకు పొలానికి.. రోడ్డు దాటుతుండగా కారు ఢీకొని రైతు మృతి
Allu Aravind | హీరోగా అల్లు అరవింద్,హీరోయిన్గా జయసుధ.. సినిమా టైటిల్ కూడా చెప్పేశారు!
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

