Thammudu | నితిన్ తమ్ముడు కోసం భారీ యాక్షన్ సీక్వెన్స్.. ఎంత ఖర్చు పెడుతున్నారో తెలుసా..?
Thammudu | టాలీవుడ్ యువ హీరో నితిన్ (Nithiin) నటిస్తున్న సినిమాల్లో ఒకటి ‘తమ్ముడు’ (Thammudu). కాంతార ఫేం సప్తమి గౌడ (Saptami Gowda) ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. అలనాటి అందాల తార లయ కీలక పాత్రలో నటిస్తున్నట్టు ఇప్పటికే ఓ అప్డేట్ తెరపైకి వచ్చింది.
Thammudu | హిట్టు ఫ్లాపుతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు టాలీవుడ్ యువ హీరో నితిన్ (Nithiin). నితిన్ నటిస్తున్న సినిమాల్లో ఒకటి ‘తమ్ముడు’ (Thammudu). వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్నాడు. కాంతార ఫేం సప్తమి గౌడ (Saptami Gowda) ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. అలనాటి అందాల తార లయ కీలక పాత్రలో నటిస్తున్నట్టు ఇప్పటికే ఓ అప్డేట్ తెరపైకి వచ్చింది. లయ ఇందులో నితిన్ సోదరిగా కనిపించబోతున్నట్టు సమాచారం.
తాజా అప్డేట్ ప్రకారం ఈ సినిమాలో వచ్చే కీలక యాక్షన్ సీక్వెన్స్‌ను షూట్ చేస్తున్నారు. సుమారు 50 మంది ఫైటర్లు పాల్గొంటున్న ఈ సీక్వెన్స్ కోసం ఏకంగా రూ.8 కోట్లు ఖర్చు చేస్తున్నారట. రామోజీఫిలింసిటీలో రాబోయే 10 రోజులపాటు ఈ షూట్ కొనసాగనుందని ఇన్సైడ్ టాక్. తన సోదరి జీవితంలో ఎదురయ్యే పలు సవాళ్లకు ఎదురునిలబడే వ్యక్తిగా నితిన్ కనిపించబోతున్నాడని తెలుస్తోంది. ఈ మూవీని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్‌రాజు-శిరీష్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తమ్ముడు డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ను పాపులర్ ఓటీటీ ప్లాట్ ఫాం అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకుంది.
నితిన్ దీంతోపాటు వెంకీ కుడుముల (Venky Kudumula) దర్శకత్వంలో రాబిన్‌హుడ్ సినిమా చేస్తున్నాడని తెలిసిందే. ఆస్తులున్నోళ్లంతా నా అన్నదమ్ముళ్లు. ఆభరణాలు వేసుకున్నోళ్లంతా నా అక్కాచెల్లెళ్లు. అవసరం కొద్దీ వాళ్ల జేబుల్లో చేతులు పెడితే ఫ్యామిలీ మెంబర్ అని కూడా చూడకుండా నా మీద కేసులు పెడుతున్నారు… అంటూ గ్లింప్స్ వీడియోలో రాబిన్‌హుడ్ సినిమాపై అంచనాలు పెంచేస్తున్నాడు నితిన్.
మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యేర్నేని, రవి శంకర్ నిర్మి్స్తున్న ఈ మూవీలో నటకిరిటీ రాజేంద్రప్రసాద్, వెన్నెల కిశోర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని జీవీ ప్రకాశ్ కుమార్ మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు. ఈ చిత్రానికి సాయి శ్రీరామ్ సినిమాటోగ్రఫర్ కాగా.. ప్రవీణ్ పూడి ఎడిటర్. రామ్ కుమార్ ఆర్ట్ డైరెక్టర్.
తమ్ముడు ప్రీ లుక్ పోస్టర్..
#Nithiin‘s #Thammudu
Available post-theatrical release in @PrimeVideoINProduction house: Sri Venkateshwara Creations
Producer(s): Dil Raju
Director: Venu Sriram
Writer(s): Venu Sriram
Cast: Nithiin, Sapthami, Laya#AreYouReady #PrimeVideoPresents pic.twitter.com/0LRjHx1IAt— Vamsi Kaka (@vamsikaka) March 19, 2024
రాబిన్‌హుడ్ టైటిల్ గ్లింప్స్..
Unmasking the Con Man from the most entertaining & adventurous world 💥💥
Say hello to your new family member – #ROBINHOOD ❤️🔥
Title reveal glimpse out now!
– https://t.co/BoPSPtzMT4#IdhiVere #VN2 @actor_nithiin @VenkyKudumula @gvprakash pic.twitter.com/liAOgVVKwD— Mythri Movie Makers (@MythriOfficial) January 26, 2024
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Foreign currency | శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా ఫారిన్ కరెన్సీ పట్టివేత
Karimnagar | ధ్రువీకరణ పత్రం అందేదెలా?.. కరీంనగర్ నగరపాలక సంస్థ నిర్లక్ష్యంతో విలీన గ్రామాల వారికి తిప్పలు
Samantha | సమంతదే నంబర్ వన్.. టాప్ 4లోకి దూసుకొచ్చిన రష్మిక మందన్నా..!
Road accident | బీదర్‌లో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు సంగారెడ్డి వాసులు దుర్మరణం
Ganja Delivery Racket | డెలివరీ ముసుగులో గంజాయి దందా.. ఇద్దరిని అరెస్టు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

