ENGW vs INDW : మహిళల పొట్టి ప్రపంచకప్ సన్నాహక సిరీస్‌లో భారత జట్టుకు ఇంగ్లండ్ షాకిచ్చింది. తొలి టీ20లో విజయంతో జోరుమీదున్న టీమిండియాను రెండో మ్యాచ్‌లో ఆతిథ్య జట్టు చిత్తు చేసింది. ఫ్రేయా కెంప్(39 నాటౌట్), అమీ జోన్స్(28) రాణించగా భారత్‌కు 169 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించిన ఇంగ్లండ్ పరుగులతో గెలుపొంది సిరీస్ సమం చేసింది. మంధాన(32), యస్తికా భాటియా(33) పోరాడినా మిగతా వాళ్లు చేతులెత్తేయడంతో హర్మన్‌ప్రీత్ సేన మ్యాచ్ చేజార్చుకుంది.
ఇంగ్లండ్ గడ్డపై విజయంతో ప్రపంచకప్ సన్నాహక సిరీస్‌ను ఆరంభించిన భారత జట్టు రెండో మ్యాచ్‌లో తేలిపోయింది. ప్రత్యర్థిని కట్టడి చేయడంలో విఫలమైన టీమిండియా.. 169 పరుగుల లక్ష్యాన్ని అందుకోలేకపోయింది.
భారీ ఛేదనలో ఓపెనర్లు షఫాలీ వర్మ(22), స్మృతి మంధాన(32)లు దూకుడుగా ఆడినా ఇంగ్లండ్ బౌలర్లు వికెట్ల వేటతో పరగులు వేగాన్ని అడ్డుకున్నారు. డేంజరస్ షఫాలీని లారెన్ బెల్ పెవిలియన్ పంపగా.. యస్తికా భాటియా(33), మంధాన పవర్ ప్లేలో స్కోర్ 40 దాటించారు. అనంతరం ఫ్రేయా కెంప్ ఓవర్లో రెండు ఫోర్లు బాదిన మంధాన చివరి బంతికి సిక్సర్ కొట్టబోయి క్యాప్సే చేతికి చిక్కింది. దాంతో రెండో వికెట్ 43 పరగుల భాగస్వామ్యానికి తెరపడింది.
England win the 2nd T20I by 26 runs.
All to play for in the series decider in Taunton on Tuesday.
Scorecard ▶️ https://t.co/qaQTNLMyMq#TeamIndia | #ENGvIND pic.twitter.com/pBY3lm20j2
— BCCI Women (@BCCIWomen) May 30, 2026
మంధాన ఔటయ్యాక క్రీజులోకి వచ్చిన కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్(28) బిగ్ షాట్లతో అలరించింది. ఈ క్రమంలోనే టీ20ల్లో నాలుగు వేల పరుగులు పూర్తి చేసుకుంది. యస్తిక రిటైర్డ్ హర్ట్‌గా డగౌట్ చేరగా.. జెమీమా రోడ్రిగ్స్(1), దీప్తి శర్మ(2)లు విఫలమయ్యారు. అరుంధతి రెడ్డి(4 నాటౌట్), శ్రేయాంక పాటిల్(6)లు సైతం ఇలా వచ్చి అలా వెళ్లడంతో భారత్ 9 వికెట్ల నష్టానికి 142 పరుగులే చేసింది. ఫలితంగా 26 పరుగుల తేడాతో గెలిచి సిరీస్ సమం చేసింది. నిర్ణయాత్మక మూడో టీ20 జూన్ 2న జరుగనుంది.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్ 21 పరుగులకే తొలి వికెట్ కోల్పోయింది. తొలి అంతర్జాతీయ టీ20 ఆడుతున్న నందిని శర్మ(1-36) ఓవర్లో సోఫీయా డంక్లే(10) వికెట్ కీపర్ రీచా ఘోష్ చేతికి చిక్కింది. ఆ తర్వాత డానీ వ్యాట్(29), అమీ జోన్స్ (28) భారత బౌలర్లను ఉతికేస్తూ స్కోర్ బోర్డును ఉరికించారు.
వ్యాట్ ఔటయ్యాక.. అలిసే క్యాప్సే(28), హీథర్ నైట్(18)లు మిడిల్ ఓవర్లలో చెలరేగగా.. డెత్ ఓవర్లలో ఫ్రేయా కెంప్(39 నాటౌట్), డానియెల్లే గిబ్సన్ (11 నాటౌట్) దంచేశారు. వీరిద్దరు ఆరో వికెట్‌కు 42 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. దాంతో, ఇంగ్లండ్ నిర్ణీత ఓవర్లలో 168 పరుగులు చేయగలిగింది.