IND vs SL : గాలే టెస్టులో తొలిరోజే భారత జట్టు పటిష్ట స్థితిలో నిలిచింది. శ్రీలంక స్పిన్నర్లను సమర్ధంగా ఎదుర్కొన్న దేవ్‌దత్ పడిక్కల్(131 నాటౌట్) తొలి శతకంతో చెలరేగి భారీ స్కోరందించాడు. కేఎల్ రాహుల్(77 రిటైర్డ్ హర్ట్) అర్ధ శతకంతో మెరవగా.. ఇద్దరూ 150 ప్లస్ భాగస్వామ్యం నెలకొల్పారు. టీ బ్రేక్ అనంతరం వర్షం అంతరాయం కలిగించినా.. రిషభ్ పంత్(27 నాటౌట్)తో పడిక్కల్ యాభై రన్స్ జోడించాడు. దాంతో, టీమిండియా 288/2తో సంతృప్తిగా తొలి రోజును ముగించింది.
తొమ్మిదేళ్ల తర్వాత శ్రీలంకలో తొలి టెస్టు ఆడుతున్న భారత జట్టు అదరగొట్టింది. సుదీర్ఘ ఫార్మాట్లో ఆరొందల మ్యాచ్.. పైగా 80వ స్వాతంత్య్ర దినోత్సవం రోజున దేవ్‌దత్ పడక్కల్(131 నాటౌట్) సెంచరీతో గర్జించాడు. లంకపై మంచి రికార్డున్న కేఎల్ రాహుల్‌తో(77 రిటైర్డ్ హర్ట్) సైతం అర్ధ శతకంతో మెరిశాడు. ఓపెనర్ యశస్వీ జైస్వాల్(32) రనౌటయ్యాక లంచ్ సెషన్ ఆసాంతం క్రీజులో నిలిచిన రాహుల్ టీమిండియా స్కోర్ రెండొందలు దాటించాడు.
Stumps on Day 1 in Galle! 🏟️
Fifty partnership up between Devdutt Padikkal & Rishabh Pant 🤝
A fine opening day of the First #SLvIND Test for #TeamIndia as they reach 288/2 after 73 overs 👌👌
See you tomorrow for Day 2 action.
Scorecard ▶️ https://t.co/M9LVyCAp8y pic.twitter.com/kI0J3sQSZJ
— BCCI (@BCCI) August 15, 2026
ఓపెనర్‌గా వచ్చి లంక బౌలర్ల సహనాన్ని పరీక్షించిన రాహుల్ టీ బ్రేక్ తర్వాత బ్యాటింగ్‌కు రాలేదు. కండరాల నొప్పితో విలవిలలాడిన అతడు రిటైర్డ్ హర్ట్‌గా క్రీజును వదిలాడు. దాంతో.. ఆ తర్వాత వచ్చిన శుభ్‌మన్ గిల్(16) స్వల్ప స్కోర్‌కే వెనుదిరిగాడు. ప్రభాత జయసూర్య ఓవర్లో గిల్ క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.
Century and counting 🔥
That feeling when you get to your Maiden Test Ton! 💯
Updates ▶️ https://t.co/M9LVyCAp8y#TeamIndia | #SLvIND pic.twitter.com/arfiTOrS5v
— BCCI (@BCCI) August 15, 2026
వర్షం అంతరాయ కలిగించే సమయానికి శతక వీరుడు పడిక్కల్ జతగా రిషభ్ పంత్(27 నాటౌట్) నిలబడ్డాడు. అయితే.. వర్షం అంతరాయంతో 63 ఓవర్ పూర్తయ్యాక కాసేపు ఆటను నిలిపివేశారు అంపైర్లు. అప్పుడు టీమిండియా స్కోర్.. 239/2. వాన తగ్గాక పంత్ ఫోర్లు, సిక్సర్లతో అలరించాడు. దాంతో, తొలి రోజు ఆట ముగిసే సరికి రెండు వికెట్ల నష్టానికి భారత జట్టు 288 పరుగులు చేసింది.