South Delhi | ఢిల్లీలో భారీ వర్షం.. కూలిన ఐదంతస్తుల బిల్డింగ్.. శిథిలాల కింద చిక్కుకున్న పలువురు
South Delhi : ఢిల్లీలో ఘోర ప్రమాదం జరిగింది. భారీ వర్షం, వేగంగా వీస్తున్న గాలుల కారణంగా మూడంతస్తుల బిల్డింగ్ కూలిపోయింది. ఈ ఘటన దక్షిణ ఢిల్లీ, సాకేట్ మెట్రో స్టేషన్ సమీపంలో, మెహ్రౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం రాత్రి జరిగింది.
South Delhi : ఢిల్లీలో ఘోర ప్రమాదం జరిగింది. భారీ వర్షం, వేగంగా వీస్తున్న గాలుల కారణంగా మూడంతస్తుల బిల్డింగ్ కూలిపోయింది. ఈ ఘటన దక్షిణ ఢిల్లీ, సాకేట్ మెట్రో స్టేషన్ సమీపంలో, మెహ్రౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం రాత్రి జరిగింది. ఐదు అంతస్థుల బిల్డింగ్ కూలిపోవడంతో స్తానికులు ఫైర్ డిపార్ట్మెంట్కు సాయంత్రం 7.44 గంటలకు సమాచారం అందించారు. ఆ వెంటనే ఫైర్ సిబ్బంది, పోలీసులు, ఇతర సహాయక బృందాలు రంగంలోకి దిగాయి.
మూడు ఫైర్ ఇంజిన్లు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించాయి. పోలీసులు, వైద్య బృందాలతోపాటు అంబులెన్స్‌ల్ని అధికారులు సిద్ధంగా ఉంచారు. ఈ బిల్డింగ్ కింద పలువురు చిక్కుకున్నట్లు సమాచారం. శిథిలాలు తొలగించి, అందులోని వారిని రక్షించేందుకు రెస్క్యూ బృందాలు ప్రయత్నిస్తున్నాయి. ఇప్పటివరకు పలువురిని సహాయక బృందాలు వెలికితీశాయి. గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రులకు తరలించారు. ఈ ఘటనలో బాధితులకు సంబంధించి అధికారులు ఇంకా ఎలాంటి సమాచారాన్ని వెల్లడించలేదు. శిథిలాల కింద చిక్కుకున్నవారిని రక్షించడమే లక్ష్యంగా సహాయక కార్యక్రమాలు కొనసాగుతున్నాయని అధికారులు వెల్లడించారు.
#WATCH | Delhi: Rescue operation is underway after a five storey building collapsed in the Mehrauli police station area. pic.twitter.com/hzQl92FsSp
— ANI (@ANI) May 30, 2026
ఢిల్లీలో ప్రస్తుతం భారీ వర్షాలు పడుతున్నాయి. 70 నుంచి 90 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ నిపుణులు సూచిస్తున్నారు. ఇంతకాలం ఎండలతో అల్లాడిపోయిన ఢిల్లీ వాసులకు ఇది కాస్త ఊరట కలిగించే అంశమే. అయితే, భారీ వర్షాలు, గాలులు ప్రమాదకరంగా మారాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Building
- Mehrauli
- Saket
- South Delhi
RELATED ARTICLES
తాజా వార్తలు
PM Modi | ప్రభుత్వం మారినా రాష్ట్ర అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తాం.. తమిళనాడులో ప్రధాని మోదీ
Iran Warning | యెమెన్ విషయంలో జోక్యం వద్దు.. పాకిస్థాన్‌కు ఇరాన్ వార్నింగ్..!
Farmers Protest | కరెంట్ కోతలను నిరసిస్తూ సబ్‌స్టేషన్ వద్ద రైతుల వంటవార్పు
truck rams Durga idol procession | దుర్గా విగ్రహం ఊరేగింపుపైకి దూసుకెళ్లిన లారీ.. ముగ్గురు మృతి, పది మందికి గాయాలు
CJP Leaders | పౌరులపై మోదీ ప్రభుత్వం యుద్ధం చేస్తోంది.. ఇది బహిరంగ ఎమర్జెన్సీ.. సీజేపీ నేతల ఆరోపణ
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

