రియల్‌లో అదానీ దూకుడు.. 72% పెరిగిన సంపద : హురున్ ఇండియా
ఒకవైపు రియల్ ఎస్టేట్ రంగం కుదేలైనప్పటికీ దేశీయ శ్రీమంతుడు గౌతమ్ అదానీ సంపద మాత్రం ఆకాశమే హద్దుగా దూసుకుపోయింది. గడిచిన ఏడాదికాలంలో గౌతమ్ అదానీ, ఆయన కుటుంబం రియల్ ఎస్టేట్ ఆదాయం 72 శాతం వృద్ధి నమోదైందని 2026 గ్రోహ్-హురున్ ఇండియా రియల్ ఎస్టేట్ 150’ పేరుతో విడుదలైన నివేదిక వెల్లడించింది.
ముంబై, జూలై 14 : ఒకవైపు రియల్ ఎస్టేట్ రంగం కుదేలైనప్పటికీ దేశీయ శ్రీమంతుడు గౌతమ్ అదానీ సంపద మాత్రం ఆకాశమే హద్దుగా దూసుకుపోయింది. గడిచిన ఏడాదికాలంలో గౌతమ్ అదానీ, ఆయన కుటుంబం రియల్ ఎస్టేట్ ఆదాయం 72 శాతం వృద్ధి నమోదైందని 2026 గ్రోహ్-హురున్ ఇండియా రియల్ ఎస్టేట్ 150’ పేరుతో విడుదలైన నివేదిక వెల్లడించింది. కొన్నేండ్లుగా రియల్ ఎస్టేట్ వ్యాపారం నిర్వహిస్తున్న గౌతమ్ అదానీ కుటుంబం..ఇటీవల ముంబైలోని ధారావి స్లమ్ ప్రాజెక్టును చేజిక్కించుకున్నది.
ప్రణవ్, రాజేశ్ అదానీలు నిర్వహిస్తున్న అదానీ ప్రాపర్టీస్ గత ఏడాదికాలంలో విలువ రూ.38 వేల కోట్లు పెరిగి రూ.90,400 కోట్లకు చేరుకున్నది. దీంతో ఆయన స్థానం నాలుగో స్థానానికి ఎగబాకింది. బీఎస్ఈ రియల్టీ ఇండెక్స్ 20 శాతం పతనమవడంతో 151 కంపెనీల్లో కేవలం 31 సంస్థల విలువ మాత్రం పెరుగగా, 74 సంస్థల విలువ పడిపోయింది. ఆయా మొత్తం సంస్థల నికర విలువ కేవలం రెండు శాతం అధికమైనట్టు నివేదిక వెల్లడించింది. గడిచిన తొమ్మిదేండ్లలో ఇదే అత్యల్ప వృద్ధి అని హురున్ ఇండియా ఫౌండర్ అనాస్ రెహమాన్ తెలిపారు. కానీ, ఒబెరాయి, ప్రిస్టేజ్ ఎస్టేట్స్ ప్రాపర్టీస్, గోద్రెజ్ ప్రాపర్టీలు టాప్-10 నుంచి వైదొలిగాయి.
- రూ.1.46 లక్షల కోట్ల సంపదతో డీఎల్ఎఫ్ తొలిస్థానంలో నిలిచింది.
- ఆ తర్వాత స్థానంలో రూ.93,700 కోట్లతో లోధా డెవలపర్లు నిలువగా..టాటా గ్రూపునకు చెందిన ఐహెచ్‌సీఎల్ రూ.93,300 కోట్లతో మూడో స్థానం వరించింది.
- గౌతమ్ అదానీ రూ.90,400 కోట్లతో నాలుగో స్థానం సరిపెట్టుకున్నారు.

Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NBK 112 | మ్యూజిక్ డైరెక్టర్‌పై క్లారిటీ.. అనిరుధ్, జీవీ ప్రకాష్‌లకు నో ఛాన్స్, బాలయ్య సినిమా అప్డేట్ ఇదే!
TN CM Vijay | జైలు నుంచి ఖైదీల పరారీ ఘటన.. తమిళనాడు సీఎం విజయ్ కీలక ఆదేశాలు..!
AP News | ఏపీలో దారుణం.. తరగతి గదిలో విద్యార్థినిపై ఎలక్ట్రిక్ రంపంతో నిందితుడి దాడి.. పరిస్థితి విషమం
Sanjeev Arora: జైలులో సంజీవ్ అరోరా.. లుథియానా వెస్ట్ సీటు కేటాయింపు
నల్లగొండలో ఎలక్ట్రిక్ బస్ డ్రైవర్ల నిరసన
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

