2డీజీ డ్రగ్ సాచెట్ ఖరీదు రూ 990

న్యూఢిల్లీ : డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ సహకారంతో డీఆర్డీఓ అభివృద్ధి చేసిన యాంటీ కొవిడ్ డ్రగ్ 2డీజీ సాచెట్ రూ 990కు అందుబాటులో ఉండనుంది. పౌడర్ రూపంలో లభించే ఈ మందును కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు డిస్కౌంట్ ధరపై సరఫరా చేస్తారు. 2డీజీ డ్రగ్ అత్యవసర వాడకానికి డీసీజీఐ ఇటీవల ఆమోద ముద్ర వేసిన సంగతి తెలిసిందే.
కరోనా బారినపడి దవాఖానల్లో చికిత్స పొందే రోగుల్లో ఈ మందు వాడకం సత్ఫలితాలు ఇచ్చినట్టు క్లినికల్ ట్రయల్స్ లో వెల్లడైంది. 2డీజీ వాడిన రోగులు త్వరగా కోలుకోవడమే కాకుండా, వారికి ఆక్సజన్ అందించే అవసరం గణనీయంగా తగ్గినట్టు వెల్లడైంది. పౌడర్ రూపంలో తయారైన ఈ మందును నీళ్లలో కలిపి తీసుకోవాలి. ఈ మందు శరీరంలోని వైరస్ కణాల్లోకి వెళ్లి వైరస్ మరన్ని కణాల్లోకి వ్యాప్తి చెందకుండా అడ్డుకుంటుంది. ఆక్సిజన్ పై ఆధారపడి దవాఖానల్లో చేరాల్సిన రోగులకు ఈ మందు వరంగా మారనుంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Covid-19
- Dr Reddys Labs
- DRDO
RELATED ARTICLES
తాజా వార్తలు
Section 22A | సెక్షన్ 22ఏ జాబితా నుంచి తొలగించినా.. ఆస్తులు కొనేందుకు వెనుకడుగు వేస్తున్న ప్రజలు!
India vs Zimbabwe | హర్మన్‌ప్రీత్ విధ్వంసం.. షఫాలీ సునామీ.. జింబాబ్వే సిరీస్ క్లీన్‌స్వీప్
Civil Supplies | సివిల్ సైప్లెలో అవినీతి రాజ్యం.. మిల్లర్లతో మిలాఖత్, గన్నీ బ్యాగుల టెండర్లలో కమీషన్ల దందా!
Ramagundam Thermal Plant | రామగుండం ప్లాంట్‌పై పూటకో మాట.. రెండున్నరేళ్లుగా తేలని నిర్ణయం!
Cyberabad Police | పోలీసు గస్తీకి సుస్తీ.. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో దందాలు, సెటిల్ మెంట్లతో ఖాకీలు బిజీ!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

