ఎన్ఐఏ అదుపులో అనుమానిత ఐసిస్ ఉగ్రవాది
ISIS sucpected terrorist: నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) అధికారులు అనుమానిత ఐసిస్ ఉగ్రవాది మహ్మద్ ఆషిక్ (25)ను

చెన్నై: నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) అధికారులు అనుమానిత ఐసిస్ ఉగ్రవాది మహ్మద్ ఆషిక్ (25)ను అదుపులోకి తీసుకున్నారు. తమిళనాడులోని మైలదుతురైలో గురువారం రాత్రి ఆషిక్‌ను అరెస్ట్ చేసినట్లు ఎన్ఐఏ తెలిపింది. 2018లో కోయంబత్తూరులో కొందరు నేతలను టార్గెట్ చేసినట్లు నమోదైన నేరపూరిత కుట్ర కేసులో ఆషిక్ నిందితుడిగా ఉన్నట్లు వెల్లడించింది. అరెస్టు చేసిన తర్వాత ఆషిక్‌ను చెన్నైకి తరలించింది.
ఎన్ఐఏ వర్గాలు శుక్రవారం తెలిపిన వివరాల ప్రకారం.. తమిళనాడులోని వేర్వేరు ప్రాంతాలకు చెందిన ఏడుగురు కలిసి కోయంబత్తూరులో ఓ బృందంగా ఏర్పడ్డారు. వీరంతా 2018లో ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా (ఐసిస్)కు విధేయతను ప్రకటించారు. కోయంబత్తూరులో కొందరు నేతలను హత్య చేసి, మత సామరస్యాన్ని దెబ్బతీయడంతోపాటు దేశ భద్రత, సార్వభౌమాధికారాలకు విఘాతం కలిగించాలని కుట్రపన్నారు.
ఆ ముఠాలో మహమ్మద్ ఆషిక్ కూడా ఒకడని ఎన్ఐఏ తెలిపింది. మైలదుతురైకి సమీపంలోని నీడూర్లో బ్రాయిలర్ షాపులో పని చేస్తుండగా ఆషిక్‌ను గురువారం రాత్రి అరెస్టు చేశారు. 2018 సెప్టెంబరులోనే ఆషిక్ ముఠాను ఎన్ఐఏ అరెస్టు చేసింది. చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఆషిక్‌కు గతంలో బెయిలు మంజూరైంది. ఆ తర్వాత తను కోర్టు విచారణకు హాజరు కావడం మానేయడంతో నాన్ బెయిలబుల్ వారంట్ జారీ అయింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Section 22A | సెక్షన్ 22ఏ జాబితా నుంచి తొలగించినా.. ఆస్తులు కొనేందుకు వెనుకడుగు వేస్తున్న ప్రజలు!
India vs Zimbabwe | హర్మన్‌ప్రీత్ విధ్వంసం.. షఫాలీ సునామీ.. జింబాబ్వే సిరీస్ క్లీన్‌స్వీప్
Civil Supplies | సివిల్ సైప్లెలో అవినీతి రాజ్యం.. మిల్లర్లతో మిలాఖత్, గన్నీ బ్యాగుల టెండర్లలో కమీషన్ల దందా!
Ramagundam Thermal Plant | రామగుండం ప్లాంట్‌పై పూటకో మాట.. రెండున్నరేళ్లుగా తేలని నిర్ణయం!
Cyberabad Police | పోలీసు గస్తీకి సుస్తీ.. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో దందాలు, సెటిల్ మెంట్లతో ఖాకీలు బిజీ!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

