టాటా గ్రూప్ చేతికి ఆన్లైన్ సరుకుల బిగ్ బాస్కెట్

న్యూఢిల్లీ: ఆన్లైన్ పచారీ సరుకుల అంగడి బిగ్‌బాస్కెట్‌లో మెజారిటీ వాటాను టాటా గ్రూప్ సొంతం చేసుకుంది. దీంతో ఈ-కామర్స్‌లో పెద్ద సంస్థలైన అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, జియోమార్ట్ వంటి సంస్థలతో టాటా సంస్థ పోటీకు దిగినట్టయింది. టాటా సన్స్ తమ సొంత అనుబంధ సంస్థ టాటా డిజిటల్ ద్వారా బిగ్‌బాస్కెట్‌ను టేకోవర్ చేసింది. కోవిడ్ మహమ్మారి ఫలితంగా లాక్డౌన్లు పదేపదే వస్తుండడంతో ఆన్లైన్ షాపింగ్ ఊపందుకుంటున్న తరుణంలో టాటా ఈ రంగంలోకి కాలుమోపడం విశేషం. భారత్‌లో వ్యక్తిగత వినిమయంలో పచారీ అనేది అతిపెద్ద భాగమని టాటా డిజిటల్ సీఈవో ప్రతీక్ పాల్ అన్నారు. భారీస్థాయి వినిమయ వస్తువుల డిజిటల్ వ్యవస్థను రూపొందించాలన్న తమ లక్ష్యానికి బిగ్ బాస్కెట్ టేకోవర్ అనుగుణంగా ఉందని పేర్కొన్నారు. అలీబాబా ప్రమోట్ చేసిన బిగ్‌బాస్కెట్ సూపర్ మార్కెట్ గ్రాసరీ సప్లయిస్ లిమిటెడ్ అనే కంపెనీ ఆధ్వర్యంలో నడుస్తున్నది. ఈ కంపెనీలో 63.4 శాతం వాటా కొనుగోలుకు టాటా చేసిన ప్రతిపాదనను కాపింటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా గత ఏప్రిల్ నెలలో ఆమోదించింది. 2011లో బెంగళూరులో ప్రారంభించిన బిగ్ బాస్కెట్ ప్రస్తుతం 25 నగరాల్లో అందుబాటులో ఉంది. కాగా ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫాం క్యూమిన్, లైఫ్ స్టైల్ ప్లాట్‌ఫాం టాటా క్లిక్, ఎలెక్ట్రానిక్స్ స్టోర్ క్రోమా వంటి వివిధ రకాల కంజూమర్ బిజినెస్‌లను ఒకే గొడుగు నీడకు తెచ్చేందుకు సూపర్ యాప్ తయారు చేస్తున్నట్టు టాటా గ్రూప్ ఇదివరకే ప్రకటించింది. బిగ్ బాస్కెట్ ను కూడా అందులో చేర్చే అవకాశాలున్నాయి.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

