జాతీయ జెండాను కేజ్రీవాల్ అవమానించారు : కేంద్రమంత్రి
జాతీయ జెండాను కేజ్రీవాల్ అవమానించారు : కేంద్రమంత్రి | ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ జాతీయ జెండాను అమానిస్తున్నారని కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి ప్రహ్లాద్ పటేల్ ఆరోపించారు.

న్యూఢిల్లీ : ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ జాతీయ జెండాను అమానిస్తున్నారని కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి ప్రహ్లాద్ పటేల్ ఆరోపించారు. ఈ మేరకు ఆయన శుక్రవారం కేంద్ర ప్రభుత్వానికి, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్కు లేఖ రాశారు. ఇటీవల కేజ్రీవాల్ నిర్వహిస్తున్న వీడియో కాన్ఫరెన్సుల్లో ఆయన కూర్చున్న కుర్చీ వెనుకలా పెట్టిన జాతీయ హోంమత్రిత్వశాఖ నిబంధనలకు అనుగుణంగా లేదని.. జెండాల్లో ఆకుపచ్చ రంగును పెద్దదిగా చేసి.. వక్రీకరించారని, మధ్యలో ఉండే తెలుపుదనాన్ని తగ్గించారని ఆరోపించారు. దేశ జాతీయ జెండా నియమావళికి ఇది విరుద్ధమన్నారు.
పొరపాటును వెంటనే సరిదిద్దాలని సూచించారు. అరవింద్ కేజ్రీవాల్ టెలివిజన్ బ్రీఫింగ్లో ప్రసంగించినప్పుడల్లా తన దృష్టి ఆయన కుర్చీ వెనుకలా ఉన్న జాతీయ జెండానే ఆకర్షిస్తుందన్నారు. కుర్చీ వెనుక పెట్టిన జాతీయ జెండాలు రాజ్యాంగాన్ని ఉల్లంఘించే విధంగా ఉన్నట్లు తెలిపారు. అలంకారం కోసం జాతీయ జెండాలను ఉపయోగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మధ్యలోని తెలుపుదనం ఆకుపచ్చని రంగుతో తగ్గిపోయిందన్నారు. ఈ విషయాన్ని తెలిసో, తెలియకో పట్టించుకోని సీఎం దృష్టికి తీసుకురావాలనుకుంటున్నానని పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి
రోడ్డు ప్రమాదంలో చిన్నారి సహా ఐదుగురి దుర్మరణం
నేడు 43వ జీఎస్టీ కౌన్సిల్ భేటీ
‘యాస్’ ప్రభావిత ప్రాంతాల్లో నేడు ప్రధాని పర్యటన
కరోనా మార్గదర్శకాలు జూన్ 30 వరకు పొడగించిన కేంద్రం
తుఫాను సమయంలో పుట్టిన శిశువులకు ‘యాస్’ పేరు
దేశంలో భారీగా తగ్గిన కరోనా కేసులు..
కల్తీ మద్యం సేవించి ఏడుగురు మృతి
‘సీబీఎస్ఈ పరీక్షల రద్దు’పై విచారణ వాయిదా వేసిన సుప్రీం కోర్టు
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

