కరోనా మార్గదర్శకాలు జూన్ 30 వరకు పొడగించిన కేంద్రం
కరోనా మార్గదర్శకాలు జూన్ 30 వరకు పొడగించిన కేంద్రం | దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతున్న నేపథ్యంలో కొవిడ్ మార్గదర్శకాలను జూన్ 30వ తేదీ వరకు కేంద్రం పొడగించింది.

న్యూఢిల్లీ : దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతున్న నేపథ్యంలో కొవిడ్ మార్గదర్శకాలను జూన్ 30వ తేదీ వరకు కేంద్రం పొడగించింది. కరోనా కేసులు ఎక్కువగా ఉన్న జిల్లాల్లో ఆంక్షలను కఠినంగా అమలు చేయాలని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను ఆదేశించింది. దక్షిణ, ఈశాన్యంలోని పలు ప్రాంతాలకు మినహాయింపును ఇచ్చింది. ఈ సందర్భంగా హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా మాట్లాడుతూ కొత్త కరోనా కేసులు తగ్గుతున్నాయని, ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య ఎక్కువగానే ఉందన్నారు. ఈ మేరకు నియంత్రణ చర్యలు కచ్చితంగా కొనసాగించడం చాలా ముఖ్యమన్నారు.
స్థానిక పరిస్థితులు, అవసరాలు, వనరులను అంచనా వేసిన తర్వాత రాష్ట్రాలు, యూటీలు ఏదైనా సడలింపులను తగిన సమయంలో, గ్రేడెడ్ పద్ధతిలో పరిగణించవచ్చని రాష్ట్రాలకు జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఏప్రిల్ 29న జారీ చేసిన మార్గదర్శకాలు జూన్ 30 వరకు కొనసాగుతాయని చెప్పారు. మార్గదర్శకాల మేరకు ఆక్సిజన్, ఐసీయూ పడకలు, వెంటిలేటర్లు, తాత్కాలిక ఆసుపత్రుల ఏర్పాటుతో పాటు అంబులెన్స్‌లు అందుబాటులో ఉంచాలి. ఐసోలేషన్ వసతులతో పాటు అవసరమైన చర్యలు తీసుకోవాలని హోంశాఖ రాష్ట్రాలకు సూచించింది. అయితే, తాజా మార్గదర్శకాల్లో లాక్‌డౌన్‌పై హోంశాఖ ఎలాంటి ప్రస్తావన చేయలేదు.
ఇవి కూడా చదవండి
ఇంటికి దగ్గర్లోనే టీకా
20 ఏండ్ల కిందటిదైనా దర్యాప్తు చేస్తాం!
రోడ్డు ప్రమాదంలో చిన్నారి సహా ఐదుగురి దుర్మరణం
నేడు 43వ జీఎస్టీ కౌన్సిల్ భేటీ
‘యాస్’ ప్రభావిత ప్రాంతాల్లో నేడు ప్రధాని పర్యటన
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

