‘యాస్’ ప్రభావిత ప్రాంతాల్లో నేడు ప్రధాని పర్యటన
‘యాస్’ ప్రభావిత ప్రాంతాల్లో నేడు ప్రధాని పర్యటన | యాస్ తుఫాను ప్రభావంతో ఒడిశా, పశ్చిమ బెంగాల్లో భారీగా నష్టం జరిగింది. నలుగురు మృతి చెందగా.. 21లక్షల మందికిపై ప్రభావం చూపింది.

న్యూఢిల్లీ : యాస్ తుఫాను ప్రభావంతో ఒడిశా, పశ్చిమ బెంగాల్లో భారీగా నష్టం జరిగింది. నలుగురు మృతి చెందగా.. 21లక్షల మందికిపై ప్రభావం చూపింది. ఈ క్రమంలో తుఫాను ప్రభావంపై సమీక్షించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం ఆయా రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. ప్రధాని మొదట ఢిల్లీ నుంచి భువనేశ్వర్ చేరుకుంటారు. ఆ తర్వాత అక్కడ సమీక్ష జరిపి, బాలాసోర్, భద్రక్ తదితర ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వేకు వెళ్తారు. ఆ తర్వాత బెంగాల్‌లోని పశ్చిమ మేదీనిపూర్ జిల్లాలోని కలైకుండకు చేరుకుంటారు. సీఎం మమతా బెనర్జీ, ఇతర అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. ఆ తర్వాత మమత, సీఎస్ బండియోపాధ్యాయతో కలిసి పూర్బా మేదినీపూర్, ఉత్తర, దక్షిణ 24 పరగణాలతో పాటు ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే చేపట్టనున్నారు.
ఇవి కూడా చదవండి
ఇంటికి దగ్గర్లోనే టీకా
20 ఏండ్ల కిందటిదైనా దర్యాప్తు చేస్తాం!
రోడ్డు ప్రమాదంలో చిన్నారి సహా ఐదుగురి దుర్మరణం
నేడు 43వ జీఎస్టీ కౌన్సిల్ భేటీ
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్

