నేడు 43వ జీఎస్టీ కౌన్సిల్ భేటీ
నేడు 43వ జీఎస్టీ కౌన్సిల్ భేటీ | జీఎస్టీ కౌన్సిల్ 43వ సమావేశం శుక్రవారం జరుగనుంది. ఉదయం 11 గంటలకు వీడియోకాన్ఫరెన్స్ ద్వారా జరుగనుండగా.. సమావేశానికి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన వహించనున్నారు.

న్యూఢిల్లీ : జీఎస్టీ కౌన్సిల్ 43వ సమావేశం శుక్రవారం జరుగనుంది. ఉదయం 11 గంటలకు వీడియోకాన్ఫరెన్స్ ద్వారా జరుగనుండగా.. సమావేశానికి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన వహించనున్నారు. కొవిడ్ మహమ్మారి సెకండ్ వేవ్ మధ్య రాష్ట్రాలకు పరిహారం, పలు మందులు, వైద్య పరికరాలు, ఆరోగ్య సేవలపై పన్ను మినహాయింపు తదితర కీలక అంశాలపై జీఎస్టీ కౌన్సిల్ చర్చించే అవకాశం ఉందని తెలుస్తోంది. ద్విచక్ర వాహనాలపై జీఎస్టీ తగ్గించడం, పెట్రోల్, డీజిల్‌ను జీఎస్టీలోకి తీసుకురావడంపై చర్చించే చర్చించనున్నట్లు తెలుస్తున్నది. జీఎస్టీ కౌన్సిల్ ఈ ఏడాదిలో తొలిసారిగా సమావేశమవుతోంది. చివరి సారిగా గతేడాది అక్టోబర్‌లో భేటీ అయ్యింది.
కరోనా మహమ్మారి నేపథ్యంలో రాష్ట్రాలకు పరిహారం, అవసరమైన వైద్య సామాగ్రిపై జీఎస్టీ సమస్యలపై ప్రస్తావించే అవకాశం ఉందని కేంద్ర వర్గాలు భావిస్తున్నాయి. పన్ను రేట్ల తగ్గింపుతోపాటు 2017లో వ్యాట్ స్థానంలో జీఎస్టీ అమలులోకి వచ్చినప్పుడు పరిహారం చెల్లిస్తామని రాష్ట్రాలకు కేంద్రం హామీ ఇచ్చింది. దాని ప్రకారం రాష్ట్రాలకు రూ.2.69 లక్షల కోట్ల మేరకు కేంద్రం పరిహారం చెల్లించాల్సిన అవసరం ఉంది. ఈ మేరకు బకాయిలపై పట్టుబట్టే అవకాశం ఉంది. మహమ్మారి నేపథ్యంలో వైద్య పరికరాలకు డిమాండ్ పెరిగింది. ఇప్పటికే పలు రాష్ట్రాలు జీఎస్టీ మినహాయించాలని డిమాండ్ చేశారు.
హ్యాండ్ శానిటైజర్లు, ఫేస్ మాస్క్‌లు, గ్లోవ్స్, పీపీఈ కిట్లు, ఆక్సిమీటర్లు, వెంటిలేటర్లుపై పన్ను మినహాయించాలని పంజాబ్ ఆర్థిక మంత్రి మన్‌ప్రీత్ సింగ్ బాదల్ కేంద్రాన్ని కోరారు. వ్యాక్సిన్లపై ఐదు శాతం జీఎస్టీని తొలగించడం ధరలను ప్రతికూలంగా ప్రభావితం చేస్తుందని ఇటీవల సీతారామన్ స్పష్టం చేశారు. వాటిపై పన్ను తగ్గిస్తే, ఔషధాల ధరలు పెరిగిపోతాయని పేర్కొన్నారు. కరోనా నేపథ్యంలో ద్విచక్ర వాహనాలపై జీఎస్టీ స్లాబ్‌ను తగ్గించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే జీఎస్టీ పరిధిలోకి పెట్రోల్, డీజిల్‌ను తీసుకువచ్చే అంశంపై చర్చించే అవకాశం ఉన్నది. ఈ వర్చువల్ మీటింగ్‌లో కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్, రాష్ట్రాల ఆర్థిక మంత్రులు, సీనియర్ అధికారులు పాల్గొనున్నారు.
ఇవి కూడా చదవండి
ఇంటికి దగ్గర్లోనే టీకా
20 ఏండ్ల కిందటిదైనా దర్యాప్తు చేస్తాం!
రోడ్డు ప్రమాదంలో చిన్నారి సహా ఐదుగురి దుర్మరణం
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

