నవ్వులు పంచే ‘DNK’
ప్రతిష్టాత్మక మైత్రీమూవీమేకర్స్ నిర్మించిన క్రైమ్ కామెడీ ఎంటర్టైనర్ ‘DNK’. మౌళి తనూజ్ ప్రశాంత్ హీరోగా నటించిన ఈచిత్రానికి శ్రీను కంబాల దర్శకుడు.
ప్రతిష్టాత్మక మైత్రీమూవీమేకర్స్ నిర్మించిన క్రైమ్ కామెడీ ఎంటర్టైనర్ ‘DNK’. మౌళి తనూజ్ ప్రశాంత్ హీరోగా నటించిన ఈచిత్రానికి శ్రీను కంబాల దర్శకుడు. సుస్మితశెట్టి కథానాయిక. శుక్రవారం సినిమా విడుదల కానున్నది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ప్రీరిలీజ్ ఈవెంట్‌ని నిర్వహించారు. ప్రముఖ హీరో శ్రీవిష్ణు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి చిత్రబృందానికి శుభాకాంక్షలు అందించారు. హీరో మౌళి మాట్లాడుతూ ‘ఇది చాలా వినోదాత్మకమైన సబ్జెక్ట్. దానికి తగ్గట్టే అందరూ హాయిగా నవ్వుకునేలా దర్శకుడు శ్రీను కంబాల ఈ సినిమాను తెరకెక్కించారు.
టీమ్ అంతా మనసుపెట్టి పనిచేశారు. సినిమా అద్భుతంగా వచ్చింది. తప్పకుండా అందరికీ నచ్చుతుంది’ అని నమ్మకం వెలిబుచ్చారు. ప్రతిష్టాత్మక మైత్రీ సంస్థ ద్వారా దర్శకునిగా పరిచయం అవ్వడం ఆనందంగా ఉందని, ఆద్యంతం వినోదాన్ని పంచే సినిమా ఇదని, ఒళ్లు దగ్గర పెట్టుకుని సినిమా తీశానని దర్శకుడు శ్రీను కంబాల చెప్పారు. ఇది తప్పక విజయం సాధించే సినిమా అని నిర్మాత రవిశంకర్ నమ్మకంగా చెప్పారు. ఇంకా చిత్రబృందంతోపాటు ప్రముఖ దర్శకులు బుచ్చిబాబు, వివేక్ ఆత్రేయ, శివనిర్వాణ, సాయిమార్తాండ్, నిర్మాత ఎస్కేఎన్ కూడా మాట్లాడారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్

