వారానికి సరిపడా కూరగాయలు, నిత్యావసరాలు ఒకేసారి కొనడం చాలామందికి అలవాటు. కానీ, సరైన ప్లానింగ్ లేకుండా షాపింగ్ చేస్తే ఆహారం వృథా కావడంతో పాటు ఖర్చు కూడా పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా త్వరగా పాడయ్యే కూరగాయలను ఎక్కువగా కొనడం వల్ల ప్రతి నెలా అనవసరంగా వందల రూపాయలు నష్టపోతారని తాజా విశ్లేషణ వెల్లడించింది. షాపింగ్‌కు వెళ్లే ముందు ఇంట్లో ఇప్పటికే ఉన్న సరుకులను ఒకసారి చెక్ చేసుకోవాలి.
ఈ వారానికి ఏం వండాలనేది ముందుగానే నిర్ణయించుకోవడం అవసరం. ఎక్కువ రోజులు నిల్వ ఉండే కూరగాయలు ఒకేసారి కొనడం, త్వరగా పాడయ్యేవి అవసరమైనప్పుడే తీసుకోవడం మంచిది. అలాగే ఆఫర్ ఉందని అవసరం లేని వస్తువులు కొనకుండా, లిస్ట్ తయారుచేసుకొని దాని ప్రకారం కొనుగోలు చేస్తే ఖర్చును గణనీయంగా తగ్గించుకోవచ్చు. ఈ చిన్న ప్లానింగ్‌తో చేసిన షాపింగ్… డబ్బుతో పాటు ఫుడ్ వేస్ట్‌ను కూడా తగ్గిస్తుందని గుర్తుచేస్తున్నారు.