Sam Altman : టెస్లా గ్రూప్ చీఫ్ (Tesla group Chief) ఎలాన్ మస్క్ (Elon Musk), ఓపెన్ ఏఐ సీఈవో (OpenAI CEO) శామ్ ఆల్ట్‌మన్ (Sam Altmon) మధ్య సోషల్ మీడియా (Social Media) వేదికగా వార్ కొనసాగుతోంది. వీళ్ల మధ్య గత కొంతకాలంగా ఓపెన్ ఏఐ సంస్థ పనితీరు విషయంలో వివాదం నడుస్తోంది. గత ఏడాది రెండుసార్లు ఓపెన్ ఏఐ సంస్థపై ఎలాన్ మస్క్ కోర్టుకు కూడా వెళ్లారు. ఈ క్రమంలో తాజాగా ఓపెన్ ఏఐ సంస్థను 97.4 బిలియన్ డాలర్లు పెట్టి కొనుగోలు చేస్తామని ఎలాన్ మస్క్ నేతృత్వంలోని పెట్టుబడిదారుల బృందం ఆఫర్ చేయడం వివాదాన్ని మరింత తీవ్రం చేసింది.
ఎలాన్ మస్క్ నేతృత్వంలోని పెట్టుబడిదారుల బృందం తాము 97.4 బిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో రూ.8.5 లక్షల కోట్లు) పెట్టి ఓపెన్ఏఐ సంస్థను కొనుగోలు చేస్తామని శామ్ ఆల్ట్‌మన్‌కు ఆఫర్ చేసింది. అయితే మస్క్ టీమ్ ప్రతిపాదనను శామ్ ఆల్ట్‌మన్ తిరస్కరించారు. అంతేకాదు ఎలాన్ మస్క్‌కు రివర్స్ కౌంటర్ కూడా ఇచ్చారు. ‘నేనే 9.74 బిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో రూ.85 వేల కోట్లు) పెట్టి మీ ఎక్స్ (X) సంస్థను కొంటా. అమ్ముతారా..?’ అంటూ సోషల్ మీడియాలో రివర్స్ ప్రపోజల్ చేశారు.
ఎలాన్ మస్క్ తన ఓపెన్ఏఐ సంస్థకు 97.4 బిలియన్ డాలర్లు పెడుతానంటే.. శామ్ ఆల్ట్‌మన్ మస్క్‌కు చెందిన X సంస్థకు కేవలం 9.74 బిలియన్ డాలర్లు పెడుతానని ప్రతిపాదన చేశారు. అంటే తన ఓపెన్ఏఐ సంస్థ విలువలో X సంస్థ విలువ కేవలం పదో వంతు మాత్రమేనని ఆల్ట్‌మన్ పరోక్షంగా కౌంటర్ ఇచ్చారు. అయితే ఆల్ట్‌మన్ పోస్టుకు మస్క్ వెంటనే స్పందించారు. ఆల్ట్‌మన్‌ను ఉద్దేశించి ‘మోసగాడు (Swindler)’ అని పోస్టు చేశారు. గతంలో కూడా శామ్ ఆల్ట్‌మన్ పేరును ఎలాన్ మస్క్ ‘స్కామ్ ఆల్ట్‌మన్ (Scam Altman)’ అని పోస్టు చేశారు.
కాగా 2022 లో ఎలాన్ మస్క్ 44 బిలియన్ డాలర్లు పెట్టి ఎక్స్ సంస్థను కొనుగోలు చేశారు. ఇప్పుడు శామ్ ఆల్ట్‌మన్ దాన్ని కేవలం 9.74 బిలయన్ డాలర్లకు కొంటానని రివర్స్ ఆఫర్ చేయడం ద్వారా మస్క్‌కు కౌంటర్ ఇచ్చారు. ఈ ఆసక్తికరమైన సోషల్ మీడియా వార్ ఇప్పుడు వ్యాపార వర్గాలు, ఐటీ పరిశ్రమల్లో టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యింది.
ఓపెన్ ఏఐ అనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్టార్టప్ సంస్థను స్థాపించినప్పుడు ఆ సంస్థ కో ఫౌండర్స్‌లో ఎలాన్ మస్క్ ఒకరు. ఎలాంటి లాభాపేక్ష, వ్యాపారకాంక్ష లేకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను ఓపెన్ సోర్స్ చేసి అందరికీ ఉచితంగా ఉపయోగపడేలా చేయాలన్నదే ఓపెన్ఏఐ సంస్థ లక్ష్యమని, కానీ ఆ తర్వాత కాలంలో ఓపెన్ఏఐ సంస్థ లాభం కోసం మాత్రమే పనిచేసే వ్యాపార సంస్థగా మారిందని ఎలాన్ మస్క్ ఆరోపిస్తున్నారు. ఇదే విషయమై మస్క్ 2024లో రెండుసార్లు కోర్టుకు కూడా వెళ్లారు. ఓపెన్ఏఐ సంస్థ లక్ష్యాలను గుర్తుచేస్తూ లాభం కోసం పనిచేయడం పక్కనపెట్టి నలుగురికి ఉపయోగపడేలా సంస్థ పనిచేయాలని అన్నారు. ఓపెన్ఏఐ సంస్థ భవిష్యత్ ప్రణాళికలు కూడా మానవాళికి ఆందోళనకరంగా ఉన్నాయని చెప్పారు. ఇప్పుడు ఓపెన్ఏఐ సంస్థను కొనుగోలు చేయడానికి ముందుకు రావడానికి కారణం కూడా అదేనని మస్క్ తెలిపారు. అయితే ఎలాన్ మస్క్ ఆరోపణలను ఓపెన్ఏఐ సంస్థ ఖండించింది. ఓపెన్ఏఐ సంస్థను మస్క్ సొంత సంస్థ అయిన టెస్లాలో విలీనం చేసి భారీగా డబ్బు సంపాదించుకోవాలని భావిస్తున్నారని శామ్ ఆల్ట్‌మన్ ఆరోపిస్తున్నారు.
JEE Main 2025 Results | జేఈఈ మెయిన్ ఫలితాలు విడుదల.. వెబ్సైట్లో స్కోర్ కార్డ్స్
Fire accident | ఫర్నీచర్ మార్కెట్లో భారీ అగ్నిప్రమాదం.. Video
Hamas | ట్రంప్ ఆ సంగతి తప్పక గుర్తుంచుకోవాలి.. అమెరికా అధ్యక్షుడి హెచ్చరికకు హమాస్ రెస్పాన్స్
Chattishgarh Elections | ఛత్తీస్‌గఢ్‌లో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు.. కొనసాగుతున్న పోలింగ్
Donald Trump | ఆ లోగా బందీలందరినీ విడిచిపెట్టకపోతే.. హమాస్‌కు డొనాల్డ్ ట్రంప్ డెడ్‌లైన్
Amanatullah Khan | పోలీసులపై దాడి కేసు.. ఆప్ ఎమ్మెల్యే అరెస్టుకు రంగం సిద్ధం
Bandla Ganesh | నోటి దూలతో సమస్య రావడం దారుణం.. విశ్వక్సేన్ లైలా వివాదంపై బండ్ల గణేశ్
Balkampet Temple | బల్కంపేట ఆలయంలో నకిలీ శీఘ్రదర్శన టికెట్లు.. ఉద్యోగిపై వేటు
Peanuts With Skin | పల్లీలను పొట్టుతో తినాలా..? పొట్టు తీసేసి తినాలా..? ఎలా తింటే మంచిది..?