Chattishgarh Elections : ఛత్తీస్‌గఢ్ (Chattishgarh) లో పట్టణ స్థానిక సంస్థల (Urban local bodies) ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా 173 పట్టణ స్థానిక సంస్థలకు ఒకే విడతలో పోలింగ్ నిర్వహిస్తున్నారు. ఎన్నికలు జరుగుతున్న 173 పట్టణ స్థానిక సంస్థల్లో 10 మున్సిపల్ కార్పోరేషన్లు (Muncipal corporations), 49 మున్సిపాలిటీలు (Muncipolities), 114 మున్సిపల్ కౌన్సిల్లు (Muncipal councils) ఉన్నాయి. మంగళవారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్.. సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది.
ఎన్నికల ఫలితాలను ఫిబ్రవరి 15న వెల్లడించనున్నారు. నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లోని పోలింగ్ కేంద్రాల దగ్గర ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు గట్టి భద్రత ఏర్పాటు చేశారు. ఈ మొత్తం 173 పట్టణ స్థానిక సంస్థల పరిధిలో 44.74 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. వారిలో 22.52 మంది పురుష ఓటర్లు, 22.73 మంది మహిళా ఓటర్లు ఉన్నారు.
ఈ ఎన్నికల తర్వాత మూడంచెల పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఫిబ్రవరి 17, 20, 23 పంచాయతీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఫిబ్రవరి 18, 21, 24 తేదీల్లో ఓట్లను లెక్కించి ఫలితాలను వెల్లడించనున్నారు. ఛత్తీస్‌గఢ్‌లోని నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో ఎన్నికలు నిర్వహించడం ఒక సవాల్ అని ఆ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అజయ్ సింగ్ అన్నారు.
Donald Trump | ఆ లోగా బందీలందరినీ విడిచిపెట్టకపోతే.. హమాస్‌కు డొనాల్డ్ ట్రంప్ డెడ్‌లైన్
Amanatullah Khan | పోలీసులపై దాడి కేసు.. ఆప్ ఎమ్మెల్యే అరెస్టుకు రంగం సిద్ధం
Bandla Ganesh | నోటి దూలతో సమస్య రావడం దారుణం.. విశ్వక్సేన్ లైలా వివాదంపై బండ్ల గణేశ్
Balkampet Temple | బల్కంపేట ఆలయంలో నకిలీ శీఘ్రదర్శన టికెట్లు.. ఉద్యోగిపై వేటు
Peanuts With Skin | పల్లీలను పొట్టుతో తినాలా..? పొట్టు తీసేసి తినాలా..? ఎలా తింటే మంచిది..?