Bandla Ganesh | టాలీవుడ్ యాక్టర్ విశ్వక్ నటిస్తున్న తాజా చిత్రం లైలా (Laila). రామ్ నారాయణ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్ బ్యానర్‌పై సాహు గార్లపాటి నిర్మిస్తున్నారు. ఫిబ్రవరి 14న వాలెంటైన్స్ డే సందర్భంగా ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా ఆదివారం నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో నటుడు, థర్ట్ ఇయర్స్ పృథ్వీ చేసిన కామెంట్స్ తీవ్ర దుమారం రేపాయని తెలిసిందే.
లైలా సినిమాలోని ఓ సన్నివేశం గురించి థర్ట్ ఇయర్స్ పృథ్వీ (Prudhvi raj)మాట్లాడుతూ.. లైలాలో తాను మేకల సత్తిగా చేశానని .. అయితే మేకలు ఎన్ని ఉన్నాయని షాట్ మధ్యలో అడిగితే 150 ఉన్నాయన్నాను. షాకింగ్ ఎంటో కానీ సినిమా చివరిలో లెక్కేస్తే మొత్తం 11 గొర్రెలు మాత్రమే ఉన్నాయని తెలిపారు. ఇదేంటో అర్థం కాలేదని, అన్నీ సినిమాలో బ్రహ్మాండంగా పెట్టారంటూ కామెంట్లు చేశాడు.
2019 అసెంబ్లీ ఎన్నికలలో వైఎస్సార్సీప్ గెలిచిన సీట్లను, ఇప్పుడున్న సీట్లనుద్దేశించి ఈ కామెంట్స్ చేశాడంటూ బాయ్‌కాట్ ట్రెండ్ షురూ చేశారు. అయితే తాజాగా ఈ దుమారంపై నటుడు, నిర్మాత బండ్ల గణేశ్ స్పందించాడు.
రాజకీయం, సినిమా రంగాలను ఒకటిగా చూడకూడదు. రాజకీయాల్లో ఉంటూ సినిమాలు చేసే నటీనటులు సినిమా వేదికలపై రాజకీయాలు చేయకూడదు. ఇలాంటి వారి విషయంలో నిర్మాతలు జాగ్రత్త వహించాలి. నటించిన వారి నోటి దూలతో సినిమాలకు సమస్య రావడం దారుణం. సినిమాను సినిమాగా చూడండి.. అంటూ ఎక్స్‌లో ట్వీట్ చేశాడు.
రాజకీయం సినిమా రంగాలు ఒకటిగా చూడకూడదు.
రాజకీయాల్లో ఉంటూ సినిమాలు చేసే నటీ,నటులు సినిమా వేదికలపై రాజకీయాలు చేయకూడదు.
ఇలాంటి వారి విషయం లో నిర్మాతలు జాగ్రత్త వహించాలి.
నటించిన వారి నోటి దూలకు సినిమా లకు సమస్య రావడం దారుణం.
సినిమా ను సినిమా గా చూడండి..All the best to laila…
— BANDLA GANESH. (@ganeshbandla) February 10, 2025
Akkineni Nagarjuna | నిన్ను చూసి గర్వపడుతున్నా.. నాగచైతన్య తండేల్ సక్సెస్‌పై అక్కినేని నాగార్జున
L2 Empuraan | తొలి సినిమాగా.. రిలీజ్‌కు ముందే మోహన్ లాల్ L2E అరుదైన రికార్డ్