L2 Empuraan | మలయాళం, తెలుగుతోపాటు పలు భాషల్లో సూపర్ క్రేజ్‌తోపాటు కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకున్నాడు మాలీవుడ్ మెగాస్టార్ మోహన్‌లాల్ (Mohanlal). ఈ పాన్ ఇండియా యాక్టర్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు. వీటిలో ఒకటి పృథ్విరాజ్ సుకుమారన్ డైరెక్ట్ చేస్తున్న L2 Empuraan. పృథ్విరాజ్ సుకుమారన్ దర్శకత్వం వహిస్తున్నాడు.
ఈ చిత్రంలో పృథ్విరాజ్ సుకుమారన్ (Pridviraj Sukumaran), మంజు వారియర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మార్చి 27న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. కాగా ఈ చిత్రం విడుదలకు ముందే మలయాళ ఇండస్ట్రీలో అత్యంత అరుదైన ఫీట్‌ను నమోదు చేసి వార్తల్లో నిలిచింది. ఆరు దేశాలు, 25 పట్టణాల్లో చిత్రీకరించబడిన తొలి మలయాళ సినిమాగా నిలిచింది. ఈ ఫీట్‌ను ఇప్పటివరకు ఏ మలయాళ సినిమా కూడా నమోదు చేయకపోవడం గమనార్హం.
ఈ మూవీలో ఇంద్రజిత్ సుకుమారన్, సనియా అయ్యప్పన్, సాయికుమార్, బజ్జు సంతోష్, ఫజిల్ ఇతర నటీనటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్, ఆశీర్వాద్ సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
Sairam Shankar | విలన్ ఎవరో చెప్పండి.. రూ.10 వేలు గెలుచుకోండి.. సాయి రామ్ శంకర్ బంపర్ ఆఫర్
Pushpa 2 The Rule | పుష్పరాజ్ మేనియా కంటిన్యూ.. ఇక మరో భాషలో అల్లు అర్జున్ పుష్ప 2 ది రూల్..!
Thandel | తండేల్కు నాగచైతన్య, సాయిపల్లవి టాప్ రెమ్యునరేషన్స్.. ఎంతో తెలుసా..?