Sairam Shankar | 143 ఐ లవ్ యూ, బంపర్ ఆఫర్ సినిమాలతో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు సాయి రామ్ శంకర్ (Sairam Shankar). చాలా కాలంగా సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్న ఈ టాలెంటెడ్ యాక్టర్ హీరోగా నటిస్తోన్న చిత్రం ఒక పథకం ప్రకారం (Oka Pathakam Prakaram). ఈ మూవీకి వినోద్ కుమార్ విజయన్ దర్శకత్వం వహిస్తున్నాడు.
వినోద్ కుమార్ విజయన్, గార్లపాటి రమేశ్‌తో కలిసి నిర్మిస్తున్నాడు. ఫిబ్రవరి 7న థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది సాయి రామ్ శంకర్ టీం. ఇందులో భాగంగా సాయి రామ్ శంకర్ మీడియాతో మాట్లాడుతూ.. ఓ బంపర్ ఆఫర్ ప్రకటించాడు.
మేం తండేల్ సినిమాతో రావడం లేదు.. మా ‘ఒక పథకం ప్రకారం’ సినిమాను తండేల్‌ను మించి భారీ స్థాయిలో విడుదల చేస్తున్నాం. గ్రిప్పింగ్ థ్రిల్లర్‌ను ఫిబ్రవరి 7నుంచి థియేటర్లలో చూడండి. ఇంటర్వెల్ సమయానికి మీరు విలన్ ఎవరో చెప్పండి.. రూ.10 వేలు గెలుచుకోండి.. అంటూ బంఫర్ ఆఫర్ ప్రకటించేశాడు. ఇంకేంటి మరి సినిమా చూసి విలన్ ఎవరో చెప్పేయండి. సాయి రామ్ శంకర్ బోల్డ్ ఛాలెంజ్ స్రీన్‌ప్లే, స్టోరీపై ఎంత కాన్ఫిడెంట్‌గా ఉన్నారో చెప్పకనే చెబుతున్నాయి.
“We are not releasing along with Tandel; we are releasing next to Tandel!” – @sairamshankar on *#OkaPathakamPrakaram*’s big release! 🔥 Catch this gripping thriller in theaters from Feb 7th! “If you can guess the villain by interval, take ₹10,000!” 💰 This bold challenge speaks… pic.twitter.com/et2ywEpoce
— BA Raju’s Team (@baraju_SuperHit) February 4, 2025
Pushpa 2 The Rule | పుష్పరాజ్ మేనియా కంటిన్యూ.. ఇక మరో భాషలో అల్లు అర్జున్ పుష్ప 2 ది రూల్..!
Fauji | ప్రభాస్ ఫౌజీ లాంగ్ షెడ్యూల్ ప్లాన్.. షూటింగ్ ప్లేస్ ఇదేనట..!
Thandel | తండేల్కు నాగచైతన్య, సాయిపల్లవి టాప్ రెమ్యునరేషన్స్.. ఎంతో తెలుసా..?