Fauji| గ్లోబల్ స్టార్ యాక్టర్ ప్రభాస్ (Prabhas) అభిమానులకు ఊపిరాడకుండా చేసేందుకు బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైన్లో పెట్టాడని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. వీటిలో హను రాఘవపూడి (Hanu Raghavapudi) డైరెక్ట్ చేస్తున్న ‘ఫౌజీ`(Fauji) ఒకటి. ఇమాన్వీ (Imanvi) ప్రభాస్‌కు జోడీగా నటిస్తోంది. తాజా సమాచారం ప్రకారం ఫౌజీ నెక్ట్స్ షెడ్యూల్ రేపు హైదరాబాద్‌లో షురూ కానుంది. రేపటి నుంచి సుమారు రెండు నెలల పాటు సినిమా షూటింగ్ కొనసాగనుందని ఫిలింనగర్ సర్కిల్ ఇన్సైడ్ టాక్.
హను రాఘవపూడి టీం ప్రత్యేకంగా నిర్మించిన సెట్స్‌లో లీడ్ యాక్టర్లపై వచ్చే కీలక సన్నివేశాలను ఈ షెడ్యూల్లో చిత్రీకరించనున్నారట. సీతారామం, రాధేశ్యామ్ లైన్లో వింటేజ్ బ్యాక్‌డ్రాప్‌లో ఫౌజీ సాగనుందని ఇప్పటికే వార్తలు వస్తుండగా.. ఈ చిత్రంలో ప్రభాస్ సైనికుడి పాత్ర పోషిస్తున్నాడని ఇన్సైడ్ టాక్. ప్రభాస్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ 2 చేస్తున్నాడని తెలిసిందే. దీంతోపాటు సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్లో స్పిరిట్, మారుతి డైరెక్షన్లో రాజాసాబ్ సినిమాలు కూడా చేస్తున్నాడు.
స్పిరిట్ కాప్ డ్రామా నేపథ్యంలో ఉండబోతుందని ఇప్పటికే టీ సిరీస్ అధినేత భూషణ్ కుమార్ వెల్లడించాడు. ఈ చిత్రంలో పాపులర్ సౌత్ కొరియన్ యాక్టర్ (డాన్ లీ) మడాంగ్సియోక్ (MaDongSeok) విలన్‌గా నటిస్తున్నాడు. దయాదాక్షిణ్యాలు లేని పోలీసాఫీసర్‌కు.. గ్లోబల్ క్రైమ్ సిండికేట్‌కు మధ్య జరిగే పోరు నేపథ్యంలో ఈ సినిమా ఉండబోతుంది. మరోవైపు ఈ చిత్రాన్ని భద్రకాళీ పిక్చర్స్‌పై సందీప్‌రెడ్డి వంగాతో కలిసి టి సిరీస్ అధినేత భూషణ్‌కుమార్ నిర్మిస్తున్నారు.
Game Changer OTT | మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ఓటీటీలోకి ‘గేమ్ ఛేంజర్’
Kiran Abbavaram | అప్పుడే కొత్త సినిమా.. కిరణ్ అబ్బవరం ఈ సారి ఎవరితో చేస్తున్నాడో తెలుసా..?
Game Changer | రాంచరణ్ అభిమానులకు ఎస్ థమన్ సారీ.. గేమ్ ఛేంజర్ గురించి ఏం చెప్పాడంటే..?
THE PARADISE | ఫిబ్రవరి.. జిమ్ సెషన్ స్టిల్‌తో నాని ఇచ్చిన హింట్ ఇదే