Game Changer | గ్లోబల్ స్టార్ రాంచరణ్ (Ram Charan) టైటిల్ రోల్ పోషించిన చిత్రం గేమ్‌ఛేంజర్ (Game Changer). శంకర్ (Shankar) దర్శకత్వం వహించిన ఈ మూవీలో బాలీవుడ్ భామ కియారా అద్వానీ, రాజోలు భామ అంజలి ఫీ మేల్ లీడ్ రోల్స్ పోషించారు. ఈ మూవీని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు నిర్మించగా.. ఎస్ థమన్ మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందించాడు.
జనవరి 10న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల మధ్య గ్రాండ్‌గా విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. గేమ్ ఛేంజర్ ఓఎస్టీ కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు సారీ చెప్పాడు థమన్ . దీనిక్కారణం ముందుగా ప్రకటించిన ప్రకారం గేమ్ ఛేంజర్ ఓఎస్టీ (ఒరిజినల్ సౌండ్ ట్రాక్) ఫిబ్రవరి 1న విడుదల కావాల్సింది.. కానీ ఆలస్యమైంది. ఈ నేపథ్యంలో ఆశగా చూస్తున్న అభిమానులకు థమన్ సారీ చెబుతూనే.. ఓఎస్టీ ఎప్పుడొస్తుందో చెప్పేశాడు.
గేమ్ ఛేంజర్ ఓఎస్టీని ఇవాళ సాయంత్రం 6 :30 గంటలకు లాంచ్ చేయనున్నట్టు ప్రకటించాడు. అంతేకాదు ఓఎస్టీ 16 ట్రాక్స్‌తో ఉంటుందని, వాటిలో అప్పన్న పాత్ర చుట్టూ వచ్చే ట్రాక్ తనకు చాలా ఇష్టమని కూడా చెప్పాడు. ఈ అప్డేట్తో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు అభిమానులు. ఈ చిత్రంలో నవీన్ చంద్ర, సునీల్, శ్రీకాంత్, బాలీవుడ్ యాక్టర్ హ్యారీ జోష్, ఎస్జే సూర్య, సముద్రఖని, కన్నడ నటుడు జయరామ్ ఇతర కీలక పాత్రల్లో నటించారు.
#GameChangerOST 🔥💥🔊
Ready 💪🏾 pic.twitter.com/xYnhZ3uYl2
— thaman S (@MusicThaman) February 1, 2025
Union Budget 2025 | గంటా 15 నిమిషాల పాటు కొనసాగిన నిర్మలమ్మ బడ్జెట్ ప్రసంగం