Ravi Kishan | 2025-26 ఆర్థిక సంవత్సరానికి చెందిన బడ్జెట్‌ను (Union Budget)ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇవాళ పార్లమెంట్లో ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా నటుడు, గోరఖ్‌పూర్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న రవికిషన్ (Ravi Kishan) స్పందించారు. పార్లమెంట్ ఆవరణలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రపంచంలో భారత్‌ను మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ మార్చే దిశగా ఈ బడ్జెట్‌ను పొందుపరిచినట్టు తెలిపారు.
పేదవారి పిల్లలకు మెరుగైన భవిష్యత్ కోసం మన ప్రభుత్వ స్కూళ్లకు అత్యాధునిక సౌకర్యాలు కల్పించేదిశగా అడుగులు పడ్డాయన్నారు. ప్రధాని నరేంద్రమోదీ, కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ సారథ్యంలో ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్ పేదలు, మధ్యతరగతి వాళ్లకే కాకుండా ప్రతీ ఒక్కరి సంక్షేమం కోసం రూపొందించారని ప్రశంసించారు. అద్భుతమైన బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్‌కు ధన్యవాదాలు తెలియజేశారు.
On #UnionBudget2025, BJP MP Ravi Kishan says, “… A wonderful budget has been presented for the poor, the middle class and for everyone. I would like to congratulate PM Modi and Finance Minister Nirmala Sitharaman ji for presenting a wonderful budget ..” pic.twitter.com/GAP8ES9LsL
— ANI (@ANI) February 1, 2025
Union Budget 2025 | గంటా 15 నిమిషాల పాటు కొనసాగిన నిర్మలమ్మ బడ్జెట్ ప్రసంగం