Budget 2025-26 | ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వృద్ధి మందగించినా భారత్ మెరుగైన పనితీరు సాధించిందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి చెందిన బడ్జెట్‌ను (Union Budget)ను నిర్మలమ్మ ఇవాళ పార్లమెంట్ ముందు ఉంచారు. ఉదయం 11 గంటలకు సమావేశాలు ప్రారంభం కాగానే లోక్‌సభలో బడ్జెట్‌పై ప్రసంగం ప్రారంభించారు. పేదలు, యువత, రైతులు, మహిళలకు ప్రత్యేక ప్రాధాన్యంతో ఈ బడ్జెట్‌ను రూపకల్పన చేసినట్లు చెప్పారు. గత పదేళ్లలో సాధించిన అభివృద్ధే తమ స్ఫూర్తి, మార్గదర్శి అని తెలిపారు.
ఇక ఈ బడ్జెట్లో వేతన జీవులకు భారీ ఊరట కల్పించారు. రూ.12 లక్షల వరకు ఆదాయపు పన్ను నుంచి మినహాయింపు కల్పించారు. రూ.12 లక్షలకు మించిన ఆదాయం ఉన్నవారికి శ్లాబులవారీగా పన్నులను నిర్ణయించారు. రూ.20లక్షల నుంచి రూ.24 లక్షల వరకు 25 శాతం పన్నుగా నిర్ణయించారు. రూ.16 లక్షల నుంచి 20లక్షల్లోపు ఆదాయంపై 20 శాతం పన్నుగా నిర్ణయించారు. ఇక కేంద్రంలో ప్రధాన మిత్రపక్ష రాష్ట్రమైన బీహార్‌కు వరాల జల్లు కురిపించారు.
Also Read..
Nirmala Sitharaman | చెప్పులు, తోలు పరిశ్రమకు మద్దతు.. కేంద్రీకృత ఉత్పత్తుల పథకం: నిర్మలా సీతారామన్
Union Budget 2025 | గంటా 15 నిమిషాల పాటు కొనసాగిన నిర్మలమ్మ బడ్జెట్ ప్రసంగం
Makhana board | అసెంబ్లీ ఎన్నికలకు ముందు.. బీహార్‌కు కేంద్రం బడ్జెట్ గిఫ్ట్