న్యూఢిల్లీ: చెప్పులు, తోలు పరిశ్రమకు మద్ధతు ఇవ్వడానికి కేంద్రీకృత ఉత్పత్తుల పథకాన్ని కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తుందని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharama) అన్నారు. తద్వారా పాదరక్షలు, తోలు పరిశ్రమలో ఉత్పాదకత, నాణ్యత, పోటీతత్వాన్ని పెంపొంచవచ్చని చెప్పారు. ఇందులో భాగంగా సృజనాత్మకత, అధిక నాణ్యత పాదరక్షలను సృష్టించడానికి డిజైన్ సామర్థ్యాలను పెంచుతామన్నారు. అదేవిధంగా కాంపోనెంట్ మాన్యుఫాక్చరింగ్ ద్వారా నాన్ లెదర్ క్వాలిటీ పాదరక్షలకు అవసరమైన కాంపోనెట్స్ ఉత్పత్తికి మద్దతునిస్తామన్నారు. అదేవిధంగా లెదర్, నాన్ లెదర్ చెప్పుల ఉత్పత్తికి అవసరమైన అధునాతన యంత్రాలకు అనుమతులను సులభతరం చేస్తామని వెల్లడించారు. ఈ పథకం ద్వారా 22 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. రూ.400 కోట్లకుపైగా ఆదాయం సమకూరుతుందని, రూ.11 లక్షల కోట్లకుపైగా ఎగుమతులు జరుగుతాయని అంచనా వేశారు. కొన్ని ప్రాంతాలను గుర్తించి నైపుణ్యం గల బొమ్మల తయారీని ప్రోత్సహిస్తామన్నారు.
అదేవిధంగా బొమ్మల తయారీ రంగాన్ని ప్రోత్సహిస్తామని ఆర్థికమంత్రి చెప్పారు. దీనికోసం ఒక పథకాన్ని తీసుకువస్తామని, జాతీయ కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తున్నామని చెప్పారు. బొమ్మల తయారీకి దేశాన్ని ప్రపంచ కేంద్రంగా ఏర్పాటు చేయడమే లక్ష్యంగా కొత్త పథకాన్ని తీసుకొస్తామన్నారు. దీనివల్ల బొమ్మల ఉత్పత్తిని క్రమబద్దీకరించేందుకు ప్రత్యేక క్లస్టర్లను సృంష్టిస్తామన్నారు.