Makhana board | అసెంబ్లీ ఎన్నికలకు ముందు.. బీహార్‌కు కేంద్రం బడ్జెట్ గిఫ్ట్
Makhana board | ప్రస్తుత బడ్జెట్లో తన మిత్రపక్ష రాష్ట్రమైన బీహార్‌కు మోదీ సర్కార్ గుడ్‌న్యూస్ చెప్పింది.
Makhana board | ప్రస్తుత బడ్జెట్లో తన మిత్రపక్ష రాష్ట్రమైన బీహార్‌కు మోదీ సర్కార్ గుడ్‌న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో మఖానా బోర్డు (Makhana board) ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది. బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ మేరకు ప్రకటన చేశారు. మఖానా ఉత్పత్తిని ప్రోత్సహించి రైతులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు రాష్ట్రంలో ప్రత్యేక మఖానా బోర్డును ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. అంతేకాదు మఖానా పండించే రైతులకు సాంకేతిక, ఆర్థిక సాయం కూడా అందించనున్నట్లు వెల్లడించారు. ఈ నిర్ణయంతో రైతుల ఆదాయం పెరుగుతుందని కేంద్రం భావిస్తోంది.
మఖానా ఉత్పత్తిలో బిహార్ రాష్ట్రం దేశంలోనే అతిపెద్ద కేంద్రంగా ఉంది. చాలా ఏళ్లుగా బీహార్ రైతులు మఖానాను పండిస్తున్నారు. దేశంలో 90 శాతం మఖానా బిహార్‌లో మాత్రమే ఉత్పత్తి అవుతోంది. ఉత్తర బిహార్ ప్రాంతంలో అధికంగా పండిస్తారు. అయితే, దీన్ని ప్రోత్సహించేందుకు ఇప్పటి వరకూ ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. తాజాగా ప్రభుత్వం తీసుకున్న ఈ చర్యతో మఖానా పరిశ్రమకు ఊతమిస్తుందని, రైతులకు గిట్టుబాటు ధర లభించే అవకాశాలు ఉన్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. అదే సమయంలో ఈ ఏడాది చివర్లో జరగనున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీహార్‌కు కేంద్రం ఈ బడ్జెట్ గిఫ్ట్ ఇచ్చిందంటూ ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.
Also Read..
Union Budget | వచ్చే వారం ఇన్కమ్ ట్యాక్స్ బిల్లు.. కీలక ప్రకటన చేసిన నిర్మలా సీతారామన్
Income Tax | వేతన జీవులకు భారీ ఊరట.. 12 లక్షల వరకు ఆదాయపు పన్ను మినహాయింపు
Union Budget | వచ్చే ఐదేండ్లలో అదనంగా 75 వేల మెడికల్ సీట్లు: నిర్మలా సీతారామన్
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

