Income Tax | వేతన జీవులకు భారీ ఊరట.. 12 లక్షల వరకు ఆదాయపు పన్ను మినహాయింపు
Income Tax | వేతన జీవులకు కేంద్ర ప్రభుత్వం భారీ ఊరట కల్పించింది. రూ.12 లక్షల వరకు ఆదాయపు పన్ను నుంచి మినహాయింపు కల్పించింది. ఈ మేరకు పార్లమెంటులో బడ్జెట్ ప్రసంగం సందర్భంగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఈ ప్రకటన చేశారు.
Income Tax | వేతన జీవులకు కేంద్ర ప్రభుత్వం భారీ ఊరట కల్పించింది. రూ.12 లక్షల వరకు ఆదాయపు పన్ను నుంచి మినహాయింపు కల్పించింది. ఈ మేరకు పార్లమెంటులో బడ్జెట్ ప్రసంగం సందర్భంగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఈ ప్రకటన చేశారు. అలాగే శ్లాబులను కూడా తగ్గించామని నిర్మలా సీతారామన్ తెలిపారు. రూ.12 లక్షలకు మించిన ఆదాయం ఉన్నవారికి శ్లాబులవారీగా పన్నులను నిర్ణయించారు. రూ.20లక్షల నుంచి రూ.24 లక్షల వరకు 25 శాతం పన్నుగా నిర్ణయించారు. రూ.16 లక్షల నుంచి 20లక్షల్లోపు ఆదాయంపై 20 శాతం పన్నుగా నిర్ణయించారు.
ఈ నిర్ణయం ద్వారా రూ.18 లక్షల వరకు ఆదాయం వచ్చే వారికి రూ.70 వేల వరకు లబ్ధి చేకూరనుంది. అలాగే రూ.25 లక్షల వరకు ఆదాయం వచ్చే వారికి రూ.1.10 లక్షల వరకు లబ్ధి చేకూరనుంది.
ఈ సందర్భంగానే టీడీఎస్, టీసీఎస్ రేట్లను కూడా కేంద్రం భారీగా తగ్గించినట్లు నిర్మలా సీతారామన్ తెలిపారు. వృద్ధులకు వడ్డీపై వచ్చే ఆదాయంపై రూ.50 వేల నుంచి రూ. లక్ష వరకు పెంచామని తెలిపారు. అద్దె ద్వారా వచ్చే ఆదాయంపై రూ.2.4 లక్షల నుంచి రూ.6 లక్షల వరకు ఆదాయపు పన్ను నుంచి మినహాయిస్తున్నట్లు తెలిపారు.
వచ్చే వారంలో కొత్త ఆదాయపు పన్ను బిల్లును పార్లమెంటులో పెట్టబోతున్నట్లు నిర్మలా సీతారామన్ తెలిపారు. భారతీయ న్యాయ సంహిత్ చట్టం స్ఫూర్తితో ఆదాయపు పన్నుకు చట్టం తీసుకొస్తామని ప్రకటించారు. ఆదాయపు పన్ను విధానంలో సంస్కరణలు తీసుకొస్తున్నామని నిర్మలా సీతారామన్ తెలిపారు. ఆదాయపు పన్ను విధానాన్ని మరింత సులభతరం చేస్తామని పేర్కొన్నారు. ప్రస్తుత ఆదాయపు పన్ను నిబంధనల్లో సగానికి తగ్గిస్తామని చెప్పారు. బిల్లులో సులభతర విధానం తీసుకురాబోతున్నామని అన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
RC 17 | ఆర్సీ17లో రామ్ చరణ్ సరసన ఆ ఇద్దరిలో ఒకరు .. హీరోయిన్ విషయంలో సుకుమార్ కీలక నిర్ణయం!
IND vs NZ | భారత్ దెబ్బకు న్యూజిలాండ్ విలవిల.. 53 పరుగులకే 5 వికెట్లు డౌన్!
8 ఏళ్ల క్రితం ప్రేమ పెళ్లి.. ఇప్పుడు పొరుగింటి కుర్రాడితో ఎఫైర్.. చివరకు రైలు కింద ఇద్దరూ మృతి!
Donald Trump: శ్వేతసౌధంలో దీపావళి వేడుక.. ట్రంప్‌కు హనుమాన్ చాలీసా గిఫ్ట్
Scene | సూర్య అరుదైన రికార్డు.. ‘సీన్’ తో బాక్సాఫీస్ వద్ద హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్!
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

